గ్రామాల్లో ‘సుపరిపాలనలో తొలి అడుగు’
ABN, Publish Date - Jul 31 , 2025 | 11:55 PM
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ‘సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు పాల్గొని సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు.
శ్రీకాకుళం రూరల్, జూలై 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని, ఈ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నా రని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గురువారం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ బైరినాగులపేట, అలికాం గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్ర మం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలికాం గ్రామంలో సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు, టీడీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి: శిరీష
వజ్రపుకొత్తూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. గురువారం మండలంలోని గరుడుభద్ర పంచాయతీ పరిధి మర్రిపాడులో ‘సుపరి పాలనలో తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండలా ధ్యక్షుడు సూరాడ మోహనరావు, క్లస్టర్ ఇన్‌చార్జి దువ్వాడ హేంబాబుచౌదరి, నాయ కులు శశిభూషణ్, రాపాక శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2025 | 11:55 PM