ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇరువర్గాల కొట్లాట

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:19 PM

ఈదుపురం గ్రామంలో చిన్న పిల్లల గొడవ పెద్దల కొట్లాటకు దారితీసింది.

12మందికి గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

ఇచ్ఛాపురం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఈదుపురం గ్రామంలో చిన్న పిల్లల గొడవ పెద్దల కొట్లాటకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. ఈదుపురం గ్రామంలో పిల్లలు వారం కిందట జల్దీ ఫైవ్‌ ఆడుకుంటూ గొడవపడ్డారు. ఈ గొడవ పెద్దలు వరకు వెళ్లింది. ఆ తర్వాత పెద్దలు సర్దిచెప్పడంతో అంతా వెళ్లిపోయారు. ఈ విషయమై మంగళ వారం అంబటి శంకర్‌, మద్దిల జగన్నాయకులు రెండు వర్గాలుగా విడి పోయి గొడవపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. దీంతో అంబటి శంకర్‌తో పాటు మద్దిల జగన్నాయకులకు తీవ్ర గాయాల య్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం బరం పురం మెడికల్‌కు తరలించారు. ఇరువర్గాలకు చెందిన మరో 10 మందికి తలలపై, శరీరంపై గాయాలయ్యాయి. వీరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రూరల్‌ ఎస్‌ఐ శ్రీనువాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పలాసపురంలో దొంగతనం

సోంపేట, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): పలాస పురం గ్రామంలో సోమ వారం రాత్రి సినీఫక్కీలో జరిగిన దొంగతనం కల కలం రేపింది. గ్రామానికి చెందిన బెందాళం అశోక్‌ ఇంట్లో జరిగిన ఈ చోరీలో రెండు తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపా యల నగదు పోయినట్టు ఎస్‌ఐ లవ రాజు తెలిపారు. భార్య, భర్తలు సోమవారం రాత్రి ఇంట్లో నిద్రపోయారు. అయితే ఎప్పటిలాగే ఉదయం చూసే సరికి దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సినీ ఫక్కీలో..

ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గోడపై ఉన్న వెంటిలేటర్ల నుంచి ఇంట్లోకి దూరి దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఈ దొంగతనం జరిగిన తీరును పరిశీలిస్తే ఇంటిని పూర్తిగా పరిశీలించిన తర్వాత దొంగ తనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటి స్లాబ్‌ హుక్కుకు తాడుకట్టిన తర్వాత నిచ్చెన వేసినా వెంటిలేటర్‌ అందకపోవడంతో కుర్చీపై వలను పెట్టి ఇనుప రాడ్డుతో దానిని తొలగించి లోపలికి వెళ్లినట్టు తెలుస్తోంది.

Updated Date - Jun 17 , 2025 | 11:19 PM