ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎరువుల కోసం రైతుల తోపులాట

ABN, Publish Date - Jul 23 , 2025 | 11:59 PM

రొట్టవలస గ్రామ సచివాలయం పరిధిలో బుధవారం ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు సమాచారం రావడంతో పలు గ్రామా లకు చెందిన రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే రెండు వర్గాల మధ్య ఎరువుల పంపిణీలో వివాదం ఏర్పడి తోపులాటకు దారి తీసింది.

రొట్టవలస సచివాలయం వద్ద రైతుల మధ్య తోపులాట దృశ్యం

పంపిణీ వాయిదా

సరుబుజ్జిలి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రొట్టవలస గ్రామ సచివాలయం పరిధిలో బుధవారం ఎరువుల పంపిణీ చేపడుతున్నట్లు సమాచారం రావడంతో పలు గ్రామా లకు చెందిన రైతులు అక్కడికి చేరుకున్నారు. అయితే రెండు వర్గాల మధ్య ఎరువుల పంపిణీలో వివాదం ఏర్పడి తోపులాటకు దారి తీసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. వ్యవసాయాధికారులు 440 యూరియా బస్తాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. అయితే అప్పటికే కొంతమంది రైతులు యూరియా కొనుగోలుకు ఆధార్‌, పట్టాదారు పాస్‌పుస్తకాలతో తమ పేరు నమోదు చేసుకున్నట్టు తెలపగా అదే సమయంలో గ్రామానికి చెందిన మరికొందరు రైతులు అక్కడికి చేరుకుని మాకు యూరియా బస్తాలు కేటాయించాలని కోరారు. ముందుగా నమోదు చేసుకొని క్యూలో ఉన్న రైతులకు యూరియా అందించిన తర్వాతే మిగిలిన వారికి ఇవ్వాలని ఒక వర్గం, రెండు వర్గాలకు సమానంగా పంపిణీ చేయాలని మరో వర్గం అధికారులపై ఒత్తిడి చేశారు. దీంతో ఇరువర్గాల రైతుల మధ్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త ఏర్పడడంతో విషయం తెలుసుకున్న సరుబుజ్జిలి పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించి నచ్చచెబుతున్న సమయంలో సర్పంచ్‌ ప్రతినిధి మూడడ్ల రమణపై ఒక కానిస్టేబుల్‌ దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులకు, సర్పంచ్‌ వర్గం మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు, పోలీసులు నచ్చజెప్పి నప్పటికీ ఇరువర్గాల రైతులు వినకపోవడంతో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు వ్యవసాయాధికారులు ప్రకటించారు.

Updated Date - Jul 23 , 2025 | 11:59 PM