రెయిలింగ్ కూలడంతో రైతులకు అగచాట్లు
ABN, Publish Date - May 10 , 2025 | 11:51 PM
మండలంలోని రహిమాన్‌పురం వద్ద వంశధార కాలువపై ఏర్పాటుచేసిన వంతెన రెండు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ప్రధానంగా వంతెనకు సంబంధించిన రెయిలింగ్ ఒక వైపు కూలిపోవడంతో వాహ నాల రాకపోకలకు అగచాట్లు తప్పడం లేదు. దీనికితోడు వంతెన కింది భాగంలో గజాలు తుప్పుపట్టి ప్రమాదకరంగా మారాయి. ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందు తున్నారు.
పోలాకి, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రహిమాన్‌పురం వద్ద వంశధార కాలువపై ఏర్పాటుచేసిన వంతెన రెండు దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ప్రధానంగా వంతెనకు సంబంధించిన రెయిలింగ్ ఒక వైపు కూలిపోవడంతో వాహ నాల రాకపోకలకు అగచాట్లు తప్పడం లేదు. దీనికితోడు వంతెన కింది భాగంలో గజాలు తుప్పుపట్టి ప్రమాదకరంగా మారాయి. ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందు తున్నారు.
రహిమాన్‌పురం వద్ద 25 సంవత్సరాల వంశధార కాలువపై రైతులు పంట ఉత్పత్తులు కల్లాలకు చేర్చేందుకు వంతెన నిర్మించారు. వర్షాకాలంలో పంట పొలాలకు ఈ వంతెన మీదుగా యంత్రాలు, ఎరు వులు తరలిస్తుంటారు. పంట ఉత్పత్తులను కళ్లాలకు చేర్చడానికి వం తెన ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే రెండు దశాబ్దాలు దాట డంతో వంతెన పైభాగం, కిందభాగంలో గజాలు తప్పుపట్టి శిథిలా వస్థకు చేరింది.దీంతో వరి పంటను బండ్లు, ట్రాక్టర్లతో తరలించే సమ యంలో వంతెన ఊగుతోందని రైతులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వంతెన పునర్నిర్మాణానికి నిధులు మంజూరుచేయించాలని బగ్గు రమణమూర్తికి ఆ గ్రామస్థులు కోరారు. దీంతో ఎమ్మెల్యే సంబందిత వంశధార ఇంజనీర్ సింహాచలాన్ని పంపించి కొత్తవంతెన నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించి నివేదిక ఇవ్వాలని సూచించారు. వంతెన ఇరుగ్గా ఉండడంతోపాటు రెయిలింగ్ లేకపోవడంతో ఇటీవల ఎద్దుల బండి బోల్తాపడింది. దీంతో ఒక ఎద్దుకు బలమైన గాయమై మృతిచెందిందని రైతులు తెలిపారు. ప్రధా నంగా చీకటిపడిన తర్వాత ఈ మార్గంలో గ్రామంలోకి వాహ నాలపై వచ్చే రెయిలింగ్ లేకపోవడంతో కాలువలోకి దూసుకువెళ్లే ప్రమాద ముందని భయాందోళన చెందుతున్నారు. దీంతో వంతెన పునర్ని ర్మాణానికి నిధులు మంజూరుచేయాలని రహిమాన్‌పురం గ్రామానికి చెందిన సనపల సోమేశ్వరరావు, ఉప్పాడ శ్రీనివాసరామకృష్ణ, ముఖుందరావు, శ్రీనివాసరావుతోపాటు పలువురు రైతులు ఇటీవల ఎమ్మెల్యే బగ్గురమణమూర్తికి వినతిపత్రం అందజేశారు.
Updated Date - May 10 , 2025 | 11:51 PM