ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Murder investigation : వైసీపీ నేత హత్యకు కారణం కుటుంబ తగాదా పంచాయితీనే

ABN, Publish Date - Jul 19 , 2025 | 11:15 PM

Family dispute.. YSRCP leader murder ఎచ్చెర్ల మండలానికి చెందిన వైసీపీ నేత సత్తారు గోపి హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ నెల 11న కొయిరాల జంక్షన్‌ ఫరీదుపేట వద్ద జరిగిన ఈ హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల ను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ రమణ వెల్లడించారు. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని, ఓ కుటుంబ తగాదా పంచాయితీ.. ఈ హత్యకు కారణమని స్పష్టం చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ రమణ, పోలీసుల అదుపులో నిందితులు
  • 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు

  • రాజకీయ కోణం లేదు: ఏఎస్పీ రమణ

  • శ్రీకాకుళం క్రైం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలానికి చెందిన వైసీపీ నేత సత్తారు గోపి హత్యకేసు మిస్టరీ వీడింది. ఈ నెల 11న కొయిరాల జంక్షన్‌ ఫరీదుపేట వద్ద జరిగిన ఈ హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల ను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ రమణ వెల్లడించారు. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని, ఓ కుటుంబ తగాదా పంచాయితీ.. ఈ హత్యకు కారణమని స్పష్టం చేశారు. ‘గోపి హత్య కేసు ఛేదించేందుకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదే శాల మేరకు శ్రీకాకుళం టౌన్‌ డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో జేఆర్‌పురం సీఐ ఎం.అవతారం పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేశాం. ఈ ఘటన వెనుక ఫరీదుపేటకు చెందిన కొత్తకోట సూర్యనారా యణ, పైడిపెద్ది సత్యనారాయణ, కొత్తకోట ఈశ్వరరావు, కొత్తకోట రంగనా ఽథం, సీపాన శివకృష్ణ, సీపాన అనిల్‌కుమార్‌, పైడి రంగరామానుజులు, గురుగుబెల్లి భవానీ హస్తం ఉన్నట్టు గుర్తించాం. ఆ ఎనిమిది మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాం. శనివారం ట్రిపుల్‌ఐటీ దగ్గర్లో ఎస్‌.ఎం.పురానికి చెందిన పొలాల మార్గంలో వారు ఉన్నట్టు సీఐ అవతా రానికి సమాచారం వచ్చింది. ఈ మేరకు ఆ ఎనిమిది మందిని పట్టుకోగా, నేరం అంగీకరించారు. వారిని అరెస్టు చేసి కోర్టులో రిమాండ్‌ నిమత్తం హాజరుపరిచామ’ని ఏఎస్పీ రమణ తెలిపారు.

  • ఉదంతం ఇదీ..

  • ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకు చెందిన గురుగుబెల్లి ఉమామహేశ్వర రావు, భవానీ దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు కారణంతో తగాదాలు జరుగుతున్నాయి. ఉమామహేశ్వరరావు ఎచ్చెర్ల ఎంపీపీ, వైసీపీ నేత మొదలవలస చిరంజీవి వద్ద పని చేస్తున్నారు. ఎంపీపీ చిరంజీవి ఆ దంపతుల తగాదాను సెటిల్‌మెంట్‌ చేయాలని చూశారు. కాగా.. ఎంపీపీ ఇచ్చే సలహా భవానీకి నచ్చకపోవడంతో ఆమె ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త ఉమామహేశ్వరరావుపై ఫిర్యాదు చేసింది. దీంతో 498(ఎ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఉమామహేశ్వరరావుకు ఎస్‌ఐ సందీప్‌ నోటీసులు అందించారు. అయితే భవానీ.. సత్తారు గోపి హత్య జరిగిన రోజు.. గ్రామంలో తెలిసిన ఏడుగురితో తన భర్తయిన ఉమామహేశ్వరరావు కొయిరాల జంక్షన్‌ వద్ద ఉన్న ఇంటికి వెళ్లింది. ఇంట్లో సామాన్లు తీసుకుపోవాలని ప్రయత్నించింది. ఆ సమయంలో సత్తారు గోపి, ఆయన స్నేహితుడు కోటేశ్వరరావు.. ఇంటి సామాన్లు ఎలా తీసుకుపోతారని నిలదీసేందుకు వచ్చారు. అయితే అప్పటికే భవానీతో వచ్చిన వ్యక్తులు మద్యం మత్తులో గోపీని హైవేపై నిలువరించేందుకు దాడి చేశారు. గోపి కింద పడిపోవడంతో, ఆయన స్నేహితుడు కోటేశ్వరరావు పారిపోయాడు. గోపిని పక్కనే ఉన్న సందులోకి వారంతా తీసుకెళ్లి కర్రలు, ఇటుకలతో దాడిచేయగా మృతి చెందాడు. దీంతో వారంతా పరారయ్యారని ఎఎస్పీ తెలిపారు. అయితే నిందితులుగా పేర్కొన్న కొంతమందిని గోపి కొద్దిరోజులుగా వేధిస్తూ దాడులు చేయడం కూడా హత్యకు ఒక కారణమని వివరించారు. అలాగే ఫరీదుపేటకు చెందిన టీడీపీ నేత కొత్తకోట అమ్మినాయుడును కూడా భవానీ ఈ కుటుంబ తగాదాలో ఆశ్రయించిందని తెలిసిందన్నారు. ఈ మేరకు అమ్మినాయుడు, మరికొందరిని పూర్తిస్థాయిలో విచారించి వివరాలు వెల్లడించాల్సి ఉందని ఎఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారం, ఎస్‌ఐలు సందీప్‌కుమార్‌, బాలరాజు, లక్ష్మణరావు, చిరంజీవి, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు.

Updated Date - Jul 19 , 2025 | 11:15 PM