ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉసురు తీసిన వివాహేతర సంబంధం

ABN, Publish Date - May 04 , 2025 | 11:24 PM

వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. తొలుత ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఈ విష యం తెలిసి భయంతో ప్రియురాలు కూడా ఉరేసుకుని ప్రాణా లు తీసుకుంది.

ఎచ్చెర్ల, మే 4 (ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. తొలుత ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఈ విష యం తెలిసి భయంతో ప్రియు రాలు కూడా ఉరేసుకుని ప్రాణా లు తీసుకుంది. ఈ ఘటన ఎచ్చె ర్ల మండలంలో చోటు చేసుకుం ది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం చిన్నయ్యపేట గ్రామానికి చెందిన జీరు మంగమ్మ(32)కు ఎచ్చెర్ల మండలం కొయ్యాం పంచాయతీ పాతకూర్మినాయుడుపేటకు చెందిన వ్యక్తితో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలిద్దరూ కాకి నాడలో తమ అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. అదే విధంగా లావేరు మండలం అదపాక గ్రామానికి చెందిన కొయ్యాన లోకేష్‌ (25) అనే యువకుడి తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఎచ్చెర్ల మండలం పాత కూర్మి నాయుడుపేటకు చెందిన తన తాతయ్య ఇంట్లో ఉంటూ భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో లోకేష్‌, మంగ మ్మ మధ్య పరిచయం ఏర్పడి.. అదికాస్తా వివాహేతర సంబంఽధానికి దారి తీసిం ది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి లోకేష్‌ మద్యం తాగి మంగమ్మకు ఫోన్‌ చేసి గ్రామ సమీపంలోని ఓ తోట వద్దకు రమ్మన్నాడు. ఇందుకు ఆమె నిరాక రించింది. తాను చెప్పినట్టు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్‌ లో బెదిరించాడు. అయినా ఆమె రానని చెప్పి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసింది. దీంతో లోకేష్‌ విచక్షణ కోల్పోయి తన ఇంట్లో ఉన్న పురుగు మందును తీసు కుని సమీపంలోని తోటలోకి వెళ్లి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉద యం అటు వైపు వెళ్లిన గ్రామస్థులు లోకేష్‌ మృతదేహాన్ని గమనించి కు టుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు లోకేష్‌ తాతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, లోకేష్‌ తనతో ఫోన్‌లో మాట్లాడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం, తన కాల్‌ డేటాను పరిశీలిస్తే అందరికీ తెలుస్తుందనే భయంతో మంగమ్మ ఆదివారం ఉదయం 7.30 గంటల సమ యంలో తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో శవపంచనామా నిర్వ హించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజనాసు పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

Updated Date - May 04 , 2025 | 11:24 PM