ప్రతిఒక్కరూ భక్తి మార్గాన్ని ఎంచుకోండి
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:06 AM
ww
కొత్తూరు, ఏప్రిల్ 24(ఆంరఽధజ్యోతి):ప్రతిఒక్కరూ సన్మార్గంలో పయనించేందుకు భక్తి మార్గాన్ని ఎంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనందా సర స్వతి స్వామి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొత్తగూడలో శ్రీగిరివర్ధన వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ భక్తిద్వారా జ్ఞానాన్ని సంపాదించి ముక్తి మార్గంలో పయనించేలా ఇతరుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు.కార్యక్రమంలో ఎల్.లక్ష్మీనారాయణనాయడు, ఎల్.తుల సీవరప్రసాదరావు, కొయిలాపు సంజీవరావు, శ్రీనివాసరావు, వెంకటకృష్ణ పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో వేంకటేశ్వర కల్యాణం
జలుమూరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అల్లాడలో వేంకటేశ్వరస్వామి కల్యాణం గ్రామ పురోహితులు మావుడూరి పార్వతీశ్వరశర్మ ఆధ్వర్యంలో గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అల్లాడతో పాటు పరిసర గ్రామాలకు చెందిన రామదాసుపేట, అల్లాడపేటకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం
శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరస్వామికి గురువారం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు.బహుళ ఏకాదశి పురస్కరించుకొని అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. సాయంత్రం గర్భగుడిలోగల పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొచ్చి అలంకరించి ప్రత్యేక పల్లకిలో ఆశీనులను చేశారు. వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో పార్వతీ పరమేశ్వరుల గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో ఆలయ ఈవో పి.ప్రభాకరరావు, అర్చకులు నారాయణమూర్తి, వెంకటాచలం, అప్పారావు, శివ, శ్రీకృష్ణ, సింహాచలం పాల్గొన్నారు.
నీలమణిదుర్గ ఆలయ వార్షికోత్సవం
నందిగాం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి):మండలంలోని పెంటూరులో నీలమణిదుర్గ, చిం తపోలమ్మ అమ్మవార్ల ఆలయాల ఏడో వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా గ్రామస్థుల ఆధ్వర్యంలో ఉత్సవకమిటీ నేతృత్వంలో గ్రామ పురో హితులు రేజేటి బోసుబాబు, సహాయకులు ఎం.రమేష్‌శర్మ పర్యవేక్షణలో విశేషపూజలు, హోమం, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Updated Date - Apr 25 , 2025 | 12:06 AM