ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ గ్రామం ఆర్థికంగా బలోపేతం కావాలి

ABN, Publish Date - May 25 , 2025 | 12:41 AM

జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రణాళి కాబద్ధంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌
  • సమన్వయంతో లక్ష్యాలను అధిగమించాలి

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రణాళి కాబద్ధంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లో ప్రాథమిక రంగాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామాల సామాజిక, ఆర్థిక పరిస్థి తులను, వనరులను గుర్తించి, వాటిని సద్వినియోగం చే సుకునేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల న్నారు. తొలుత ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభిం చాలని లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయం, ఉద్యానం, పాడిపరిశ్రమ, మత్స్య, పౌలీ్ట్ర, పట్టు పరిశ్రమ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల భాగస్వామ్యంతో గ్రామాల్లో సమగ్ర ఆర్థిక పరి పుష్టి సాధించడం ముఖ్యమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రా బోయే మూడేళ్లలో ఎంపిక చేసిన గ్రామాలను పూర్తిగా ప చ్ఛదనంతో నింపాలని, సాగులో 60శాతం ఉద్యాన పంట లు ఉండేలా ప్రోత్సహించాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో అధిక దిగుబడులు సాధించేందుకు యాజమాన్య పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి. భూసార పెంపు సెంటర్ల బలోపేతం, రైతు ఉత్పత్తిదా రుల సంఘాల బలోపేతం, ఫాం పాండ్ల పరిధిలో ఉద్యాన మొక్కలతో కొత్త ఎకో సిస్టమ్‌ ఏర్పాటుపై దృష్టి సారించాలి. డ్రోన్ల వినియోగం పెం చాలి. తక్కువ వర్షపాతం నమోదవు తున్న నేపథ్యంలో సూక్ష్మసాగు పద్ధ తులను విస్తరించాలి. మార్క్‌ఫెడ్‌ సహకారంతో ఎరువులు, మందులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖలు సమన్వయంతో పని చేసి గ్రామాల అభివృద్ధిని వేగవం తం చేయాలి. వ్యవసాయం, ఆరోగ్యం, మార్కెటింగ్‌, పారి శ్రామిక పెట్టుబడుల పరంగా గ్రామాలు ముందుకు సా గాలని ఆకాంక్షించారు. సమావేశంలో సీఈవో లక్ష్మీప్రసన్న, వ్యవసాయాధికారి త్రినాథస్వామి, ఉద్యానవనశాఖ ఏడీ ప్రసాదరావు, ఏపీఎంఐపి డీడీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వసతులు మెరుగుపడాలి

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 24(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మరుగు దొడ్లు, తాగునీ రు, పరిసరాల పరిశుభ్రత, తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఆర్టీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రయాణికుల అవసరా ల కోసం మరికొన్ని చోట్ల తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. పరిసరాల పరిశు భ్రతపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్ర యాణికులతో మాట్లాడి బస్‌ స్టేషన్‌లో సౌకర్యా లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.వి జయకుమార్‌, ఒకటి, రెండో డిపో మేనేజర్లు అమరసింహుడు, కె.రవి శంకర్‌ శర్మ, సూపర్‌వైజర్లు, యూనియన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 12:41 AM