ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Greevence : వినతులివ్వాలన్నా.. సమస్యే

ABN, Publish Date - Jul 21 , 2025 | 11:53 PM

Public grievances సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి.. విసిగిపోయి.. చివరకు జిల్లాకేంద్రంలోని జడ్పీలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీ-కోసం’ ప్రజా ఫిర్యాదుల వేదికలోనూ అర్జీదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

లోపలకు వెళ్లేందుకు అర్జీదారుల తోపులాట
  • జడ్పీలో ‘మీ-కోసం’ వద్ద తోపులాట

  • వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకటే మార్గం

  • క్యూలో నిల్చోలేక అర్జీదారుల ఇబ్బందులు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి.. విసిగిపోయి.. చివరకు జిల్లాకేంద్రంలోని జడ్పీలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీ-కోసం’ ప్రజా ఫిర్యాదుల వేదికలోనూ అర్జీదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ గోడు కలెక్టర్‌కు చెప్పుకుంటే.. సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో జిల్లా నలుమూలల నుంచి చాలామంది జడ్పీలో ‘మీ-కోసం’ కార్యక్రమానికి వస్తుంటారు. కానీ, ఇక్కడ వినతులివ్వడమే పెద్ద సమస్యగా మారిందని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు వినతులు ఇచ్చేందుకు, తర్వాత బయటకు వచ్చేందుకు ఒక్కటే మార్గం కావడంతో సోమవారం అర్జీదారుల రద్దీ మధ్య తోపులాట చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున క్యూలో బారులుదీరారు. కూర్చొనేందుకు ఏర్పాట్లు లేక దివ్యాంగులు, వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడ్డారు. సమస్యల పరిష్కారం మాట దేవుడెరుగు... అర్జీ సమర్పిస్తే చాలు... అనుకుంటూ చాలామంది నిట్టూర్చారు. అధికారులు స్పందించి ఈ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అర్జీదారులు కోరుతున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:53 PM