పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:27 AM
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని.. ఒక్కరోజే పెద్ద హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని.. ఒక్కరోజే పెద్ద హరిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పు రస్కరించుకుని ఆయన గురువారం తన అధి కారిక నివాసంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వ ర్యంలో మొక్కలను నాటారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటి, దేశ పరిరక్షణలో భాగం కావాలన్నారు. ఐదు లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కను నాటడమే కాదు, దాని సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని.. గోనె సంచులను వాడాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో పొన్నాడ రవికుమార్, నటుకుల మోహన్, బాడాన దేవభూషణరావు, పైడి సిందూర, టెక్కం రాంగోపాల్, బి.కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలో..
శ్రీకాకుళం లీగల్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని.. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్యద్ మౌలానా అన్నా రు. శ్రీకాకుళం జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి సంరంక్షిస్తే... భావిత రాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించిన వారమవుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగో అదనపు జిల్లా న్యాయాధికారి ఫణికుమార్, శాశ్వత లోక్‌అదాలత్ చైర్మన్ సువర్ణరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీధర్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ఎమ్మెల్యే శిరీష
పలాస, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురు వారం కేటీ రోడ్డు ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఆవరణలో మొక్క లు నాటారు. ఈ సందర్భంగా ఆమె వివిధ శాఖల అధికారు లు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మునిసి పల్ కమిషనర్ ఎన్.రామారావు, ఆర్డీవో జి.వెంకటేష్, టీడీపీ నాయకులు గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, మల్లా శ్రీనివాస్, బడ్డ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
మొక్కలను విరివిగా నాటాలి
రణస్థలం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
జి.సిగడాం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు కుమరాపు రవికుమార్, బూరాడ వెంకటరమణ, ముద్దాడ గౌరీశ్వరరావు, టంకాల మౌళీశ్వరరావు, ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపేట వద్ద..
బూర్జ, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పెద్దపేట గ్రామంలోని ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రవికుమార్ హాజరై మొక్కలు నాటారు. అనంతరం రెడ్‌క్రాస్ ఆధ్వ ర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, డీసీసీబీ చైర్మన్ సూర్యం తదితరులు పాల్గొన్నారు.
బొంతు పీహెచ్‌సీ ఆవరణలో..
జలుమూరు (సారవకోట), జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బొంతు పీహెచ్‌సీ ఆవరణలో గురువారం మొక్కలు నాటారు. మొక్కలను పెంచడం ద్వారా భావితరాలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో మోహన్‌కుమార్, ఎంపీపీ కూర్మినాయుడు, వైద్యాధికారులు సుస్మిత, సుధారాణి పాల్గొన్నారు.
ప్రతి మొక్కను సంరక్షించాలి
పాతపట్నం, జూన్ 5(ఆంధ్రజ్యోతి): నాటిన ప్రతి మొక్కను సంరక్షించు కోవడం ద్వారా వన మహోత్సవానికి సార్థకత ఏర్పడుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంద ర్భంగా పెద్దసీది జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం మొక్కలు నాటారు. ఎంపీడీవో పి.చంద్రకుమారి, డీటీ రమణ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:27 AM