సమస్యలపై ఇంజనీరింగ్ సిబ్బంది ఆందోళన
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:59 PM
ఇంజినీరింగ్ సిబ్బంది సమ స్యలు పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
ఇంజనీరింగ్ సిబ్బంది అర్ధనగ్న ప్రదర్శన
శ్రీకాకుళం కలెక్టరేట్, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్ సిబ్బంది సమ స్యలు పరిష్కరించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నగరం లోని కార్పొరేషన్ కార్యాలయం నుంచి జడ్పీ వరకు ర్యాలీగా వెళ్లి మీకోసంలో డీఆర్వోకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వై.శ్యామలరావు, ఆర్.సతీష్ మాట్లాడుతూ.. 40 రోజులుగా రాష్ట్రవ్యా ప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నామని అయినా ప్రభుత్వ స్పందిం చకపోవడం సరికాదన్నారు. అనంతరం జడ్పీ కార్యాలయం ఎదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసనను తెలిపారు. కార్యక్రమంలో వివిధ ఇంజినీరింగ్ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 23 , 2025 | 11:59 PM