ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వచ్చే నెలలో నిశ్చితార్థం..

ABN, Publish Date - Jun 28 , 2025 | 11:57 PM

కొండ వూరు గ్రామానికి చెందిన కొరికాన చైతన్య (29) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

ఇంతలోనే రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి

వజ్రపుకొత్తూరు, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): కొండ వూరు గ్రామానికి చెందిన కొరికాన చైతన్య (29) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చైతన్య శనివారం రాత్రి పూండి నుంచి పలాస వెళు తుండగా బెండి గేటు సమీపంలో సాయిబాబా గుడివద్ద గుర్తు తెలి యని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు అమ్మ నమ్మ, గున్నయ్య ఏడేళ్ల కిందటే మృతి చెందారు. తమ్ముడు హరీష్‌తో కలిసి పూండిలో అద్దెఇంట్లో నివాసం ఉంటున్నాడు. సీమెన్‌గా పనిచేస్తున్న చైతన్య కొద్ది రోజుల కిందట గ్రామానికి వచ్చాడు. ఇటీవల చైతన్యకు వివాహం నిశ్చ యం కాగా జూలై 31న నిశ్చితార్థం కావాల్సి ఉంది. ఇంతలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు విలపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఏఎస్‌ఐ రమణారెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడలో మత్స్యకారుడి మృతి

శ్రీకాకుళం రూరల్‌, జూన్‌28 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని పెద్దగనగళ్ల వానిపేట పంచాయతీ పరిధిలోగల చిన్నగనగళ్ల పేట గ్రామానికి చెందిన చిడిపిల్లి పరదేశి(48) వేట కోసం వెళ్లి మృతిచెందాడు. గ్రామస్థుల కథ నం మేరకు.. చిన్నగనగళ్లపేట గ్రామానికి చెంది న చిడిపిల్లి పరదేశి జీవనోపాధి కోసం కాకినాడకు వలస వెళ్లాడు. ఈనెల 27వ తేదీ రాత్రి సముద్రం లోకి వేటకు మరో ఆరుగురితో బోటులో బయలుదేరాడు. రాత్రి సమయంలో వేట జరుగు తుండగా బోటులో నుంచి కాలు జారి సముద్రంలో పడి గల్లంతయ్యాడు. ఈ మేరకు శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో కాకినాడ హార్బర్‌కు మృతదేహం కొట్టుకొచ్చింది. పరదేశికి భార్య కొర్లమ్మ, కుమా రుడు కార్తీక్‌ ఉన్నారు. పరదేశి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

హిరమండలం, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): తంప గ్రామానికి చెందిన డోల దొరబాబు (36) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికి త్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ తెలిపిన వివరా లిలా ఉన్నాయి.. దొరబాబు ధనుపురం సమీపంలో 5 ఏళ్ల నుంచి ఓ దాబా నిర్వహిస్తుండేవాడు. దాబా ఏర్పాటు సమయంలో రూ.5 లక్షలు అప్పు చేశారు. వ్యాపారంలో నష్టం రావడంతో పాటు అప్పునకు వడ్డీ పెర గడంతో తీర్చలేక మనస్థాపం చెందాడు. అప్పు తీర్చలేక ఈనెల 26న గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి శ్రీకాకుళం రిమ్స్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.

మఖరాపురంలో విద్యార్థిని..

కంచిలి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని మఖరాంపురం గ్రామానికి చెందిన గుడియా సాయిసా(10) చికిత్సపొందుతూ మృతిచెం దింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుడియా సాయిసా మఖరాంపురం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తుండగా పాముకాటేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సోంపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఆసుపత్రికి తరలించి చికిత్సపొందుతూ శనివారం సాయిసా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయిసా తండ్రి పూర్ణచంద్ర, తల్లి గీత కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Updated Date - Jun 28 , 2025 | 11:57 PM