మూడో సంతానానికి ప్రోత్సాహకం
ABN, Publish Date - Apr 20 , 2025 | 11:59 PM
మూడో సంతానంగా ఆడ బిడ్డ జన్మిం చడంతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయు డు ప్రోత్సాహకం అందజేశారు. మూడో సంతానంగా ఆడ బిడ్డ జన్మిస్తే రూ.50 వేలు, మగ బిడ్డ జన్మిస్తే ఆవు, దూడ ఆ కుటుంబానికి అందజేస్తానని అప్పల నాయుడు ప్రకటించిన విషయం విది తమే.
రణస్థలం, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : మూడో సంతానంగా ఆడ బిడ్డ జన్మిం చడంతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయు డు ప్రోత్సాహకం అందజేశారు. మూడో సంతానంగా ఆడ బిడ్డ జన్మిస్తే రూ.50 వేలు, మగ బిడ్డ జన్మిస్తే ఆవు, దూడ ఆ కుటుంబానికి అందజేస్తానని అప్పల నాయుడు ప్రకటించిన విషయం విది తమే. ఈమేరకు ఆదివారం నిర్వహించి న ఓ కార్యక్రమంలో పాతర్లపల్లికి చెం దిన పొన్నాడ వెంకటలక్ష్మి మూడో సం తానంలో ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో రూ.50 వేలు చెక్‌ను నిఖిలనాయుడు కలిశెట్టి చారిటిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అందజేశారు. లావే రు మండలంలోని కొత్తకుంకాం గ్రామా నికి చెందిన కుప్పిలి నాగమణి మూడో సంతానంలో మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆమెకు ఆవు, దూడా అందించారు.కొవ్వాడ మత్స్యలేసం గ్రామానికి చెందిన మైలపల్లి శాంతమ్మకు ఆవు, దూడ కోసం చెక్‌ను అందజేశారు.
Updated Date - Apr 20 , 2025 | 11:59 PM