ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి

ABN, Publish Date - Jul 01 , 2025 | 11:32 PM

మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లో పరి శ్రమల ఏర్పాటుతో జిల్లా లో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి,జూలై1(ఆంధ్రజ్యోతి): మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లో పరి శ్రమల ఏర్పాటుతో జిల్లా లో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళ వారం మండలంలోని తీరప్రాంత గ్రామ మైన ఉమి లాడలో ‘ప్రజా సేవలో ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిం చారు. పింఛన్లను పంపిణీ చేశారు. జోరువానలో మంత్రి పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రంలో పది లక్షల పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నా రని, తాను కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో మాట్లాడి మూలపేట ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నానన్నారు. ఇందులో భాగంగా హల్దియా కంపెనీ ఈ ప్రాంతంలో పెట్రోకెమికల్స్‌ పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వచ్చిందన్నారు. అమెరికాకు చెందిన ఎక్సో జిల్‌ కంపెనీ రూ.80వేల కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు గాను ఇటీవల ఆ సంస్థ ప్రతినిధులు మూలపేటలో భూములను పరిశీలించారన్నారు. పెట్టుబడులు పెట్టేం దుకు వస్తున్న పారిశ్రామిక వేత్తలు మళ్లీ జగన్‌ అనే భూతం వస్తే తమ పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్నారని, అయితే జగన్‌ భూతాన్ని వెయ్యి అడు గుల గోతిలో సీఎం చంద్రబాబు కప్పేస్తారని భరోసా కల్పించామన్నారు. మరో రెండు నెలల్లో మూలపేట పోర్టులో తొలి షిప్‌ వచ్చేలా పనులు చురుగ్గా సాగుతు న్నాయన్నారు. తీరప్రాంత అభివృద్ధి చెందే విధంగా మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్‌ పోర్టు వరకు నాలుగు రోడ్ల నిర్మాణం చేపడతామని, తద్వారా తీరం వెంబడి పరిశ్రమలు ఏర్పడి అందరికీ ఉపాధి లభిస్తుందన్నారు. సమస్యలు లేని గ్రామాలను చేయ డమే తన ధ్యేయమని, అందుకోసం అన్ని గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు, కాలువల నిర్మాణం చేపడతామ న్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఆర్డీవో కృష్ణమూర్తి, టీడీపీ నేతలు కింజరాపు హరి వరప్రసాద్‌, జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, అట్టాడ రాంప్రసాద్‌, కూశెట్టి కాంతారావు, బాడాన రమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:32 PM