హిరమండలం అభివృద్ధికి కృషి
ABN, Publish Date - Jun 28 , 2025 | 11:59 PM
హిరమండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్న రోడ్డు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
హిరమండలం,జూన్28(ఆంధ్రజ్యోతి): హిరమండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శనివారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్న రోడ్డు, కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. మోనింగి వాని చెరువులో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు హిర మండ లం మండల ప్రజలు, రైతులు త్యాగం చేయకపోతే వంశధార రిజరా ్వయర్ నిర్మా ణం జరిగి ఉండేది కాదన్నారు. వారి త్యాగాలు మరువలేనివన్నారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, జడ్పీటీసీ బుచ్చి బాబు, మండల ప్రత్యేక ఆహ్వానితుడు తిరుపతిరావు వివరించారు. వాటి పరిష్కా రానికి కృషి చేయాలని కోరారు. హిరమండలంలో ఉన్న అన్ని రోడ్లు డబుల్‌లైన్ చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండలానికి అవసరమైనన్ని లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు సీఎం చంద్రబాబుతో మాట్లాడి మంజూరు చేయిస్తానన్నారు. వంశఽధార, మహేంద్ర తనయ నదులపై వంతెనలను కేంద్ర నిధులతో చేపట్టేం దుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఎల్.ఎన్.పేట, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజాదర్బార్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎంపీడీవో కార్యాల యంలో శనివారం రాత్రి ప్రజాదర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకో వాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహ రించిన సిబ్బందిపైన చర్యలు చేపట్టేందుకు వెనుకాడేది లేద న్నారు. అనంతరం సబ్సిడీపై పాడి రైతులకు పశుదాణా పంపిణీచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మామి డి గోవిందరావు, తహసీల్దార్ జె.ఈశ్వరమ్మ, టీడీపీ నేతలు ఎం.మనోహర్ నాయుడు, కె.చిరంజీవి, వి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణం చేపట్టండి
కొత్తూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): కొత్తూరు కళాశాల సమీపంలోని ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. ఈ మేరకు శనివారం కొత్తూరు వచ్చిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి సమస్యను విన్నవిం చారు. గత మూడేళ్లుగా రోడ్డు గోతులమయమై ప్రమా దాలు జరుగుతున్నాయని, మురుగునీరు నిలువ వల్ల వ్యాధులు సంభవిస్తున్నాయని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. సమస్యను పరిష్కరించేలా చూడాలని కేంద్ర మంత్రి కలెక్టర్‌కు సూచిం చారు. అంత కుముందు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణమూర్తి స్వగ్రామం మాతలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వెళ్లి అల్పాహారం స్వీకరించారు.
Updated Date - Jun 28 , 2025 | 11:59 PM