పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు కృషి
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:25 AM
జిల్లాలోని పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మె ల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం స్పోర్ట్స్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మె ల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడి యంలో జిల్లాస్థాయి పీఈటీలు, పీడీల రెండు రోజుల వర్క్ షాప్, సెమినార్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం, కొన్ని ప్రత్యేక కారణాలవల్ల జిల్లాలో క్రీడా వసతుల కల్పనలో జాప్యం జరిగిందన్నారు. కలెక్టర్‌తో చర్చించి జిల్లాలో పాఠ శాలల్లో క్రీడల నిర్వహణకు అవసరమైన నిధులను సమ కూర్చనున్నట్లు హామీ ఇచ్చారు. డిప్యూటీ డీఈవో విజయ కుమారి మాట్లాడుతూ.. సెమినార్, వర్క్‌షాప్ నిర్వహణ వల్ల వృత్తి నైపుణ్యాభివృద్ధితోపాటు వృత్తిపరమైన సమస్యలు పరిష్కారానికి అవకాశం కలుగుతుందన్నారు. టెక్కలి డిప్యూ టీ డీఈవో పి.విలియమ్స్ మాట్లాడుతూ.. జిల్లా పాఠ శాలల క్రీడల నిర్వహణలో సమస్యలను తన దృష్టికి తీసు కోస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పీఈ టీ, పీడీల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణ, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా ఒలింపిక్ సంఘం సల హాదారు పి.సుందరరావు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, గ్రిగ్స్ కార్యదర్శి కె.మాధవ రావు, విజయ నగరం జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వెంకట్ నాయుడు తది తరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 02 , 2025 | 12:25 AM