గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ABN, Publish Date - May 11 , 2025 | 11:30 PM
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఆదివారం మందస మండలంలోని లింబుగాంలో మూడు సీసీరోడ్లకు శంకు స్థాపన చేశారు.
హరిపురం, మే11 (ఆం ధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఆదివారం మందస మండలంలోని లింబుగాంలో మూడు సీసీరోడ్లకు శంకు స్థాపన చేశారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ రహ దారులే పల్లెలకు అభివృద్ధి సూ చికలని తెలిపారు. ఐదేళ్లుగా రహదారులకునోచుకోని గ్రామా ల్లో తమ ప్రభుత్వం అభివృద్ధి బాటలు వేస్తోందని తెలిపారు. అనంతరం కమలా పురం గ్రామానికి వెళ్లే రహదారి రైల్వే భాగంలో ఉండడంతో గ్రామస్థులతో కలిసి పరిశీలించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీకే నాయుడు, బావన దుర్యోధన, దాసరి తాతారావు, రట్టి లింగరాజు, మండల లచ్చయ్య, బమ్మిడి కర్రయ్య, పొట్టి మోహనరావు, రామారావు, బొంగు దామోదరం పాల్గొన్నారు.
Updated Date - May 11 , 2025 | 11:30 PM