Masjid Development : జామియా మసీదు అభివృద్ధికి కృషి
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:34 PM
Community Welfare Urban Development శ్రీకాకుళంలో చారిత్రకమైన జామియా మసీదు అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు.
మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
శ్రీకాకుళం కల్చరల్/ అరసవల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో చారిత్రకమైన జామియా మసీదు అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అన్నారు. నగరంలోని జీటీ రోడ్డులో ఉన్న జామియా మసీదును ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రహారీ ఎత్తు పెంచేందుకు కృషి చేస్తానని, మసీదు మరమ్మతులకు నిధులు మంజూరు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా నిధులు కేటాయించేలా శ్రద్ధ వహిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎండీ అన్వర్ బాషా, ఎండీ రఫీ, అబ్దుల్ గఫర్‌ఖాన్, షేక్ హుస్సేన్, షేక్ సలీం, రహీం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 11:34 PM