రూ.600 కోట్లతో ప్రతీ ఇంటికి తాగునీరు
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:37 PM
నియోజకవర్గంలో రూ.600 కోట్లతో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుం టున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలం లోని పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన, పలు రోడ్ల ప్రారం భోత్సవం ఆదివారం చేపట్టారు.
‘తల్లికి వందనం’తో కుటుంబాల్లో పండుగ
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
నందిగాం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో రూ.600 కోట్లతో ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుం టున్నట్లు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలం లోని పలు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన, పలు రోడ్ల ప్రారం భోత్సవం ఆదివారం చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ఆయన పర్యటన సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన తల్లికివందనం పథకంతో ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్య మంత్రి పవన్‌కల్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలుచేస్తూ ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న ఇంటిలోని పిల్లలందరికీ ఈ పథకం అమలుచేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి ఇంటిలో ఒక్కరికే అమలు చేసిందన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీ భవ పథకాన్ని అమలు చేసి రైతుల్లోనూ ఆనందం నింపుతామన్నారు. రహదారులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, దానికి అనుగుణంగా నిధులు కేటాయించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. పెంటూరు- పొల్లాడ వయా శివరాంపురం, సైలాడ, బడబంద జంక్షన్ నుంచి రౌతు పురం, నందిగాం నుంచి సుబ్బ మ్మపేట, నందిగాం ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఇంద్రజీమ్ ఇంటి వరకు చేపట్టనున్న రహదారుల పనులకు శంకు స్థాపన చేశారు. అలాగే ఐటీడీఏ నిధులతో నిర్మించిన కొఠియా కొండ పేట బీటీ రోడ్డు, పెంటూరు శివాలయం, ఎస్సీ కాలనీ రహదారిని, నందిగాం ప్రాథ మిక పాఠశాల నుంచి ఆంజనేయ మందిరం వరకు సీసీ రహదారులను ప్రారంభిం చారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ సూర్యప్రకాష్, ఐటీడీఏ ఈఈ రమాదేవి, పీఆర్ డీఈఈ సుధాకర్, నాయకులు పి.అజయ్‌కుమార్, ఎం.బాలకృష్ణ, ఎస్.జానకిరాం, కె.ప్రసాద రావు, మదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కా రానికి కృషి చేస్తానన్నారు.
అరసవల్లి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళికలు
టెక్కలి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. దేవస్థానం ఈవోగా ఇటీవల బాధ్యత లు స్వీకరించిన కేఎన్‌వీడీవీ ప్రసాదరావు ఆదివారం మంత్రిని నిమ్మాడ లోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అరసవెల్లి దేవస్థానం అభివృద్ధిపై త్వరలో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం
టెక్కలి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం విలేకరులతో మాట్లా డుతూ సూపర్‌సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2, తల్లికి వందనం పథకాలు అమలు చేసిన ఘన త కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజ లకు మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం లో ప్రజలు నరకయాతన చూశారని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్వికాసం దిశగా ప్రయాణిస్తోందన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:37 PM