ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Arasavalli temple: ప్రత్యేక పూజలకు సంప్రదాయ దుస్తుల్లో రావాలి

ABN, Publish Date - Jun 20 , 2025 | 11:40 PM

Dress code Temple guidelines ప్రత్యేక పూజలకు భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని అరసవల్లి ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్‌వీడీ ప్రసాద్‌ అన్నారు. ఆలయం అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తామన్నారు.

మాట్లాడుతున్న ఈవో కేఎన్‌వీడీ ప్రసాద్‌
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 6వరకు ప్రత్యేక దర్శనాలు

  • ఉద్యోగులు సమయపాలన పాటించాల్సిందే

  • ఆదిత్యాలయ అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణే లక్ష్యం

  • కార్యనిర్వహణాధికారి కేఎన్‌వీడీ ప్రసాద్‌

  • అరసవల్లి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక పూజలకు భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని అరసవల్లి ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్‌వీడీ ప్రసాద్‌ అన్నారు. ఆలయం అభివృద్ధి, ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తామన్నారు. శుక్రవారం అరసవల్లిలోని విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. భక్తులకు మరిన్ని సేవలను అందించనున్నట్లు తెలిపారు. ‘ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే స్వామి ప్రత్యేక దర్శనానికి అనుమతి ఉంది. ఇకపై ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దర్శనాలకు అనుమతిస్తాం. రూ.100, రూ.300 టిక్కెట్లపై గర్భగుడిలోకే అనుమతిస్తాం. ఆదివారం మాత్రం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మాత్రమే భక్తులకు అంతరాలయ దర్శనం కల్పిస్తాం. క్షీరాభిషేకం, స్వామి కల్యాణం, ప్రత్యేక సేవలకు హాజరయ్యే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. పురుషులు పంచె, చొక్కా ధరించాలి. స్ర్తీలు చీర లేదా చుడీదార్‌ ధరించాలి’ అని ఈవో సూచించారు. ‘ఉద్యోగులు సమయాపాలన పాటించాల్సిందే. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డోలు వాయిద్యకారుడికి రూ.500 జరీమానా, షోకాజ్‌ నోటీసు జారీ చేశాం. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా కఠినచర్యలు తప్పవు’ అని ఈవో హెచ్చరించారు.

  • ‘ఇంద్రపుష్కరిణిని అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇంజనీరింగ్‌ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకున్నాం. త్వరలోనే ఇంజనీరింగ్‌ సిబ్బంది ఆలయానికి రానున్నారు. గతంలో వేసిన టెండర్లు రద్దయ్యాయి. అంచనాలు మళ్లీ రూపొందించి.. టెండర్లు పిలిచి.. పుష్కరిణి అభివృద్ధి పనులు చేపడతాం. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపడతాం. విద్యుత్‌శాఖ అధికారులను సంప్రదించి.. సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తాం. నాయకులు, అధికారులు, భక్తులు, అర్చకుల సహాయంతో ఆలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామ’ని ఈవో తెలిపారు.

Updated Date - Jun 20 , 2025 | 11:40 PM