రామనారాయణంలో దేవిశ్రీ ప్రసాద్
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:03 AM
విజయనగరంలోని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలోని శ్రీమద్రామాయణ ప్రాంగణాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలసి మంగళ వారం సందర్శించారు.
విజయనగరం రింగురోడ్డు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం రామనారాయణంలోని శ్రీమద్రామాయణ ప్రాంగణాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలసి మంగళ వారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలోని రామాయణ ఘట్టాలను చూసి పులకించిపోయారు. రామాయణంపై పరిఽశోధన కోసం ఏర్పాటు చేసిన వాల్మీకి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆలయ అర్చకులు చాణక్య శ్రీ హర్ష ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవిశ్రీ ప్రసాద్‌ను ఆశీర్వ దించారు. ఎన్‌సీఎస్ ట్రస్టు సభ్యులు నారా యణ ఆయనకు జ్ఞాపికను ఆయనకు అందజేశారు.
Updated Date - Apr 23 , 2025 | 12:03 AM