ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే శిరీష
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:53 PM
రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంతో పని చేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస రాజా శ్రీనివాస మెమో రియల్ (ఎస్‌ఆర్ ఎస్‌ఎం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని శని వారం ప్రారం భించారు.
మందస, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంతో పని చేస్తే అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస రాజా శ్రీనివాస మెమో రియల్ (ఎస్‌ఆర్ ఎస్‌ఎం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని శని వారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల ఎంతోమందిని ప్రయోజకులుగా చేసిన ఘనత వహించిందన్నారు. మాజీ మంత్రి గౌతు శివాజీ మాట్లాడుతూ ఈ పాఠశాలను రాష్ట్రంలోనే గుర్తింపు పొందేలా తీర్చిదిద్దాలన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాఠశాలకు అవసరమైన కంప్యూటర్లు ఎంపీ నిధుల నుంచి మంజూరుకు హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమం లో మందస రాజవంశీ యులు లిఖిల్ కుమార్ సింగ్ దేవ్, డీఈవో తిరుమల చైతన్య, హెచ్‌ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధే ద్యేయం
కాశీబుగ్గ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ అబివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శనివారం కాశీబుగ్గ 12వ వార్డులో గల ధోబీఘాట్ వద్ద ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలాస కాశీబుగ్గలో పక్కా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలి పారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రేడ్ చైర్మన్ వజ్జ బాబూరావు, కమిషనర్ రామారావు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, పీరుకట్ల విఠల్, బడ్డ నాగరాజు, దువ్వాడ శ్రీకాంత్, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 11:53 PM