యోగాభ్యాసంపై ఆసక్తి పెంపొందించుకోవాలి
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:32 PM
విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ యోగాభ్యాసంపై ఆసక్తిని పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
పాతపట్నం, జూన్ 19(ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ యోగాభ్యాసంపై ఆసక్తిని పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధ వారం పార్టీ నేతలతో కలిసి యోగాభ్యాసం చేశారు. ఈనెల 21న విశాఖలో జరగనున్న జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నుంచి నేతలు, ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పైల బాబ్జీ, కార్యదర్శి మడ్డు రామారావు తదితరులు పాల్గొన్నారు.
యోగా ట్రయల్ రన్‌కు అధికారులు
నరసన్నపేట,జూన్ 19(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈనెల 21న ప్రధాని నరేంద్రమోదీ పాల్గోనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేసేందుకు గాను పలువురు అధికారులు, నాయకు గురువారం ట్రయల్ రన్‌కు విశాఖ వెళ్లారు. క్షేత్రస్థాయిలో మాక్ యోగాలో పాల్గొనేం దుకు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. విశాఖపట్నం బీచ్ రోడ్డులో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ ఒకేలా యోగా చేసేలా ట్రయిల్ రన్ నిర్వహించినట్లు యోగాంధ్ర నియోజకవర్గ పర్యవేక్షణాధికారి, డీఎఫ్‌వో వేంకటేశ్వరరావు అన్నారు. నాలుగు మండలాల నుంచి 80 మందికి శిక్షణకు పంపించామన్నారు. శుక్రవారం ఉదయం 12 గంటలకు సుమారు 1200 మందిని ప్రత్యేక బస్సుల్లో విశాఖపట్నం తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు.
Updated Date - Jun 19 , 2025 | 11:32 PM