ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈశ్రమ్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి

ABN, Publish Date - May 03 , 2025 | 11:32 PM

ప్రతి కార్మికుడు ఈ శ్రమ్‌ కార్డు కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు.

టెక్కలి: మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి నిర్మల

టెక్కలి, మే 3(ఆంధ్రజ్యోతి): ప్రతి కార్మికుడు ఈ శ్రమ్‌ కార్డు కలిగి ఉండాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు. శనివారం అసంఘటిత కార్మికులకు న్యాయ సేవల పథకం-2015 అనే అంశం పై మండల మహిళా సమాఖ్య కార్యాలయం, శ్రీలక్ష్మి జీడి పప్పు పరిశ్రమలో అవగాహన, న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. ఈశ్రమ్‌ పోర్టల్‌లో వారి వివరాలు విధిగా నమోదు చేసుకోవాలని, తద్వారా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, బీమా పొందవచ్చన్నారు. న్యాయ సేవాధి కార సంస్థ అసంఘటిత కార్మికులకు అందిస్తున్న న్యాయ సేవలను వివరించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ పట్నాయక్‌, న్యాయవాదులు పొట్నూరు ఆనందరావు, పైడి సాయిరాజ్‌, మండల మహి ళా సమాఖ్య కార్యాలయ ఏపీవో ప్రసాదరావు, పరిశ్రమ యజమాని అనిల్‌కుమార్‌, టెక్కలి కార్మిక శాఖ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోండి

పలాసరూరల్‌, మే 3(ఆంధ్రజ్యోతి): న్యాయ సేవాధి కార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను విని యోగించుకోవాలని, దీని నిమిత్తం టోల్‌ఫ్రీ 15100 నెంబరులో సంప్రదించాలని పలాస మున్సిఫ్‌ కోర్టు న్యాయాధికారి యు.మాధురి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో అంతర్జాతీయ కార్మిక వారోత్సవాల్లో భాగంగా శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అసం ఘటిత కార్మికులు వారు పని చేసే చోట రూ.110 చెల్లించి కార్డు తీసుకుంటే ప్రమాద బీమా వర్తిస్తుం దన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్‌.వసంత్‌ కుమా ర్‌, బార్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బీకేఆర్‌ పట్నా యక్‌, కార్యదర్శి జీఎంఎస్‌ అనిల్‌రాజ్‌, కోత రజనీ కుమార్‌, ఎస్‌ఐ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సబ్‌ జైల్‌ను పరిశీలించిన న్యాయాధికారి

నరసన్నపేట, మే 3(ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్‌ జైలును నరసన్నపేట సివిల్‌ న్యాయాధికారి బి.వాణి శనివారం పరిశీలించారు. సబ్‌జైలులో ఖైదీలకు అంది స్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. సత్ప్ర వర్తన కలిగి ఉండాలని ఖైదీలకు సూచించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రావాడ కొండలరావు, జైల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:32 PM