ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం

ABN, Publish Date - May 02 , 2025 | 11:34 PM

కర్లెమ్మ పంచాయతీ నేతాజీనగర్‌ కాలనీ మూడురోడ్ల కూడలిలోని ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి తరువాత గుర్తు తెలియని వ్యక్తులు దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన సంభవించింది.

నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులతో మాట్లాడుతున్న పోలీసు అధికారులు

కొత్తూరు, మే 2(ఆంధ్రజ్యోతి): కర్లెమ్మ పంచాయతీ నేతాజీనగర్‌ కాలనీ మూడురోడ్ల కూడలి లోని ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం అర్ధరాత్రి తరువాత గుర్తు తెలియని వ్యక్తులు దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన సంభవించింది. అర్ధ రాత్రి ఈదురు గాలులు, భారీ వర్షం కురిసిన సమయంలో ఆరుబయట ఎవరూ లేక పోవడంతో ఇదే అదునుగా శ్రీరాముడు, వినాయకుడు, సువర్చలాదేవి విగ్రహాల చేతు లను ధ్వంసం చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘట న నేపథ్యంలో కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారు జామున విగ్రహాల చేతులు, ఆంజనేయ స్వామి తోక పూర్తిగా తొలగించి ఉండడాన్ని అటుగా వెళ్లిన స్థానికులు గమనించి గ్రామస్థులకు తెలియజేశారు. కొత్తూరు సీఐ ప్రసాద్‌ అమరావతి పీఎం సభకు బందోబస్తుకు వెళ్లడంతో పాతపట్నం సీఐ వి.రామారావు, కొత్తూరు ఎస్‌ఐ అమీర్‌ ఆలీ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించారు. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేశారన్న విషయం తెలుసుకున్న బీజేపీ మహి ళా విభాగం జిల్లా కన్వీనర్‌ కాపాకల దమయంతి, సమరసత సేవా సంస్థ జిల్లా మహిళా కన్వీనర్‌ బృందావతి లక్ష్మణరావు తదితరులు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని తక్షణం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసు అధికారులు ఎంత నచ్చజెప్పినా వారు నిరసనను కొనసాగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అమీర్‌ ఆలీ తెలి పారు. విగ్రహాల ధ్వంసం హిందూ వ్యతిరేకులా లేక ఆకతాయిలు చేశారా అన్న అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఘటన జరిగిన తరువాత శుక్ర వారం ఉదయం ఆలయం వద్ద పోలీసులు సీసీ కెమెరాలను అమర్చడం చర్చ నీయాంశమైంది.

Updated Date - May 02 , 2025 | 11:34 PM