ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జూన్‌లో లోటు వర్షపాతం

ABN, Publish Date - Jul 03 , 2025 | 12:18 AM

వరుణుడు కరుణించడం లేదు. జూలై మొదటి వారం వచ్చేసినా ఇంకా జిల్లాలో భారీ వర్షాలు కురవడం లేదు.

- గత నెలలో చిరుజల్లులే తప్ప భారీ వర్షాల్లేవు

-జిల్లాలో 27 మండలాల్లో తక్కువగా నమోదు

- మూడు మండలాల్లోనే ఆశాజనకం

- రైతుల్లో ఆందోళన

- ఆశలన్నీ ఈ నెల పైనే..

శ్రీకాకుళం, జూలై 2(ఆంధ్రజ్యోతి): వరుణుడు కరుణించడం లేదు. జూలై మొదటి వారం వచ్చేసినా ఇంకా జిల్లాలో భారీ వర్షాలు కురవడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మే నెలలో తీవ్రమైన ఎండతోపాటుగా సాయంత్రం వేళ భారీ వర్షాలు కురవడంతో ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా వర్షపాతం ఆ నెలలో నమోదైంది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జూన్‌ మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురిశాయే తప్ప భారీ వానలు పడలేదు. ఆ తరువాత పూర్తిగా ముఖంచాటేశాయి. జిల్లాలో 30 మండలాలు ఉండగా కేవలం జి.సిగడాం, లావేరు, రణస్థలం మండలాల్లోనే వర్షపాతం మెరుగ్గా ఉంది. ఈ మూడు మండలాల్లో మాత్రమే ఆశించిన స్థాయి కంటే కొన్ని మిల్లీమీటర్లు వర్షం అధికంగా కురిసింది. మిగతా 27 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. దీంతో రైతులు జూలై పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో కూడా పరిస్థితి ఇలానే ఉంటే ఖరీఫ్‌ సాగుకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

20.48 మి.మీ లోటు..

వాతావరణశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 20.48 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నెలకొంది. గత నెలలో 116.67 మిల్లీమీటర్ల వర్షం జిల్లాలో కురవాల్సి ఉంది. కానీ, 96.97 మి.మీ కురిసింది. మేలో 92.33 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా భారీ వర్షాలు కారణంగా ఏకంగా 159.97 మి.మీ వర్షపాతం నమోదైంది. జూన్‌లో 19.7 మిల్లీమీటర్లు లోటు ఉంది. ఈ నెల విషయానికొస్తే 1, 2 తేదీల్లో 14.01 మి.మీ వర్షం కురవాల్సి ఉంది. కానీ, 7.01 మి.మీ నమోదైంది. అక్కడక్కడా చిరుజల్లులు తప్పా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి లేదు. దీనివల్ల జిల్లాలో ఇప్పటివరకు 20.48 మీ.మీ లోటు వర్షపాతం ఉంది.

Updated Date - Jul 03 , 2025 | 12:18 AM