ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేశవరావు మృతదేహం అప్పగింతలో ప్రతిష్ఠంభన

ABN, Publish Date - May 23 , 2025 | 12:29 AM

ఛత్తీస్‌ఘడ్‌లోని నారా యణపూర్‌ జిల్లా సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతదేహం అప్పగింతపై ప్రతిష్ఠంభన నెలకొంది.

చదువుకున్నప్పటి స్నేహితులతో నంబాళ్ల కేశవరావు (సర్కిల్‌లో)

జగదల్‌పూర్‌ నుంచి వెనుదిరిగిన నంబాళ్ల బంధువులు

జీయన్నపేటలో విషాదం

హైకోర్టును ఆశ్రయించనున్న పౌరహక్కుల సంఘం నేతలు

టెక్కలి, మే 22(ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌ఘడ్‌లోని నారా యణపూర్‌ జిల్లా సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతదేహం అప్పగింతపై ప్రతిష్ఠంభన నెలకొంది. మృతదేహం కోసం జగదల్‌పూర్‌ కేశవరావు సోదరుడు నంబాళ్ల రాంప్రసాద్‌, ఎంపీటీసీ నంబాళ్ల రాజశేఖర్‌, నంబాళ్ల సుబ్బారావు, రమేష్‌, మార్పు వెంకటరమణ తదితరులు కాశీబుగ్గ, శ్రీకాకుళం పోలీ సులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం జగదల్‌పూర్‌లో ఓ లాడ్జికి చేరుకున్నారు. అప్పటికే నారాయణపూర్‌ ఎస్‌ఐ, పోలీస్‌ నెంబర్లు వారికి ఇవ్వగా నారాయణపూర్‌ పోలీసులను సంప్రదించారు. అయితే ఇక్కడి పరిస్థితులు సద్దుమణగలేదని, మూడురోజుల తరు వాత కేశవరావు మృతదేహాన్ని అప్పగిస్తామని, తిరిగి వెనక్కి వెళ్లాలని చెప్పారు. అలాగే శ్రీకాకుళం పోలీసులు సైతం వెనక్కు వచ్చేయాలని కేశవరావు బంధువులకు సూచించడంతో గురువారం వారంతా వెనుదిరిగారు. కేశవరావు మృతి చెందారనే విషయం నమ్మలేక పోతు న్నామని కోటబొమ్మాళి మండలం జీయన్నపేట గ్రామ స్థులు చెబుతున్నారు. మరోవైపు మావోయిస్టు చీఫ్‌గా వ్యవహరించిన కేశవరావు ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల సంఘం ప్రతినిధులు శుక్రవారం హైకోర్టులో రిట్‌ పిటి షన్‌ వేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేశవరావు తల్లి భారతమ్మ నుంచి రిట్‌ పిటిషన్‌కు సంబంధించి సంత కాలను సేకరించారు. కేశవరావు మృతదేహం బంధు వులకు అప్పగించాలని, ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి చిలుకు అన్నారు. కేశవరావు మృతదేహాన్ని స్వగ్రా మానికి తెప్పించాలని బొడ్డపాడు అమరవీరుల బంధు మిత్రుల కమిటీ సభ్యులు జీయన్నపేట గ్రామస్థు లను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఏఎస్పీ (క్రైమ్‌) పి.శ్రీనివాసరావు, సీఐ విజయ్‌కుమార్‌ టెక్కలిలోని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి ఇంటికి చేరుకుని అక్కడే ఉన్న కేశవరావు పెద్ద సోదరుడు ఢిల్లేశ్వరరావుతో మాట్లాడారు. మృతదేహం బంధువర్గానికి అప్పగిం చడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని వారు పోలీ సులతో అన్నట్లు సమాచారం. గురువారం రోజంతా పోలీసులు డాక్టర్‌ కృపారాణి నివాసం వద్ద వేచి ఉండడం గమనార్హం.

‘మావోయిస్టులను హత్య చేశారు’

పలాస, మే 22(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు మరో 25 మంది మావోయిస్టులను, ఆదివాసీలను పోలీసులే హత్య చేశారని పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పత్రి దానేసు ఒక ప్రకటనలో ఆరోపించారు. శాంతి చర్చ లకు తాము సిద్ధమని, ఆదివాసీలపై హత్యాకాండ ఆపాలని, ఆపరేషన్‌ కగార్‌ వెనక్కు తీసుకోవాలని కోరినా కేంద్ర ప్రభుత్వం హత్యాకాండను కొసాగిస్తోందని ఆందోళన వ్యక్తంచేశారు. బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచా రణ చేపట్టాలని తమ సంఘం డిమాండ్‌ చేస్తోంద న్నారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో అమరులైన వారికి సంతాపం తెలుపుతూ సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

చట్టవిరుద్ధ చర్యలు: సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌

ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నారాయణపురం జిల్లాలో జరిగిన నరహంతక చర్యలను ఖండిస్తూ తక్షణమే మిలటరీ చర్యలను నిలిపివేయాలని సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌ జాతీయ కార్యదర్శి దిపాంకర్‌ భట్టాచార్య గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మావో యిస్టు అగ్రనేత నంబాల కేశవరావు, ఇతర మావోయి స్టులు, ఆదివాసీ ప్రజలను బిజాపూర్‌ జిల్లాలో చట్ట వ్యతిరేకంగా హత్య చేశారని ఆరోపించారు. ఈ నరమే ధంపై న్యాయవిచారణ చేయించాలని తమ పార్టీ డిమాండ్‌ చేస్తోందని, మావోయిస్టులు ఏకపక్షంగా కాల్పులు విరమణ ప్రకటించారని, వారిపై సైనిక కార్య కలాపాలు నిలిపివేయాలని కోరారు.

Updated Date - May 23 , 2025 | 12:29 AM