ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డీఅడిక్షన్‌ కేంద్రాలు సమర్థంగా పనిచేయాలి

ABN, Publish Date - May 29 , 2025 | 11:38 PM

అక్రమ మద్యం వల్ల పేదలు, సామా న్యుల తీవ్ర అనారోగ్యానికి, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. డీ-అడిక్షన్‌ కేంద్రాలు సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మాట్లాడుతున్న స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 29(ఆంధ్రజ్యోతి): అక్రమ మద్యం వల్ల పేదలు, సామా న్యుల తీవ్ర అనారోగ్యానికి, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. డీ-అడిక్షన్‌ కేంద్రాలు సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలోమద్యం బారిన పడిన కుటుంబాలకు జీవనోపాధి కల్పనపై ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐడీ మద్యం వల్ల బలహీన వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందని,ఈ కుటుంబాలకు తక్షణ ప్రత్నామ్యాయం, జీవనోపాధిని కల్పించాలని సూచించారు. మద్యం తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై నియంత్రణ పెట్టాలని, ఇందులో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీ-అడిక్షన్‌ కేంద్రాల సమర్థ ంగా వినియోగంపై జిల్లాలో ఏర్పాటు చేసిన కేర్‌ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక లాపాలను సమీక్షించారు. ఇప్పటివరకు కమిటీ ద్వారా 16 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా 595 మంది పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్‌ కేంద్రంలో తొమ్మిది మంది చేరగా ఏడుగురు విజయవం తంగా పునరావాసం పొందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌, వైద్యారోగ్యశాఖ, పోలీసు, వెల్ఫేర్‌, విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:38 PM