ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మాన్యువల్‌గా కౌన్సెలింగ్‌ నిర్వహించాలి

ABN, Publish Date - Jun 07 , 2025 | 11:39 PM

సెకెండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు, లాంగ్వేజీ పండిట్లకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

శ్రీకాకుళం: డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ ఐక్యవేదిక ప్రతినిధులు
  • ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చాలి

  • నేడు డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తాం

  • ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు

శ్రీకాకుళం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): సెకెండరీ గ్రేడ్‌ ఉ పాధ్యాయులకు, లాంగ్వేజీ పండిట్లకు మాన్యువల్‌ కౌన్సె లింగ్‌ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్ర తినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఎన్జీ వో భవన్‌లో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టా యి. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన హామీకి భిన్నంగా సెకెండరీ గ్రేడ్‌, లాంగ్వేజ్‌ పండిట్లు, పీఈటీల బదిలీలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ పూనుకుందని చెప్పారు. ఐక్యవేదిక ఆధ్వర్యం లో వెబ్‌ ఆప్షన్లను బాయ్‌కట్‌ చేయాలని పిలుపునిచ్చా రు. ఇచ్చిన హామీ ప్రకారం మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వ హించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆదివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని.. భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సంఘ ప్రతినిధులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యా య సంఘాల ప్రతినిధులు ఎస్‌.కిషోర్‌ కుమార్‌, టి.ము రళీమోహన్‌, ఎం.మధన్‌మోహన్‌, జి.వెంకటరమణ, బాబూరావు, శివరాంప్రసాద్‌, డి.కేశవరావు, పి.రాజశేఖర్‌, వై.ఉమాశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆమదాలవలసలో..

ఆమదాలవలస, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): బదిలీల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు మాన్యువల్‌గా కౌన్సెలింగ్‌ ని ర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతి నిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద పలువురు ఉపాధ్యా యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు మాన్యు వల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అంగీకరించిందని, దానికి అనుగుణంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకపో వడం సరికాదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఉపాధ్యాయ వర్గాలకు ఆర్థికపరమైన అంశా ల్లో ప్రభుత్వం ఎటువంటి మేలు చేయకపోవడం దుర దృష్టకర మన్నారు. ఇప్పటికైనా ఎస్‌జీటీలకు మాన్యువల్‌ లో కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఉపా ధ్యాయులు భాస్కరరావు, గోపీచంద్‌, సీతారాం, చంద్ర రావు, అప్పలనాయుడు, శ్యామలరావు పాల్గొన్నారు.

రణస్థలంలో..

రణస్థలం, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రాథమి పాఠశా లల ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్‌ పద్ధతిలో నిర్వహించచాలని ఐక్య ఉపాధ్యాయ వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సమస్యలతో కూడిన వినతప్రతం ఎంఈవో త్రినాథరావు అందజేశారు. ఉపా ధ్యాయులు డి.కోటేశ్వరరావు, టి.శంకరరావు, బి.అప్పల నాయుడు, ఎస్‌.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:39 PM