ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనారోగ్యంతో కానిస్టేబుల్‌ మృతి

ABN, Publish Date - Aug 31 , 2025 | 12:07 AM

పలాస మం డలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబు ల్‌ తలగాపు శంకరరావు(38) బ్రెయిన్‌ స్టోక్‌తో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

  • ఎమ్మెల్యే గౌతు శిరీష గన్‌మన్‌గా విధులు

  • పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు

పలాస రూరల్‌, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పలాస మం డలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబు ల్‌ తలగాపు శంకరరావు(38) బ్రెయిన్‌ స్టోక్‌తో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం వీరభద్రాపురం గ్రామానికి చెందిన తలగాపు శంకరరావు జిల్లా ఆర్మ్డ్డ్‌డ్‌ విభాగం లో పని చేస్తున్నారు. ఈయన ప్రస్తుతం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గన్‌మన్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన విధి నిర్వహణలో ఉండగా ఆ యనకు బ్రెయిన్‌స్టోక్‌కు గురై ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవా రం రాత్రి మృతి చెందారు. కాగా శంకరరావుకు భార్య శిరీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్య క్రమంలో కాశీబుగ్గ డీఎస్పీ ఎంవీ అప్పారావు, పోలీసు అధికారులు పాల్గొని నివా ళులర్పించారు. అందరితో కలివిడిగా ఉండే శంకరరావు మృతితో గ్రామంలో విషా దఛాయలు అలముకున్నాయి. కాగా ఎస్పీ కేవీ మహేశ్వరరరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ ఎంవీ అప్పారావు ఆధ్వర్యంలో శంకరావు భార్య శిరీషకు పోలీసు అసోసి యేషన్‌ తరఫున రూ.లక్ష చెక్కును అందజేశారు. పోలీసు అధికారుల అసోసి యేషన్‌ ట్రెజరర్‌ భుజంగరావు, కార్యవర్గ సభ్యులు నర్సింగరావు, శంకరప్రసాద్‌, ఆర్‌ఎస్‌ఐలు హరనాథ్‌, రవి పాల్గొన్నారు. శంకరరావు భౌతికాయానికి టీడీపీ నాయకులు పీరికట్ల విఠల్‌రావు, ఏపీటీడీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, దువ్వాడ శ్రీహర్ష, బూర్లె విజయ్‌, కృష్ణంరాజు, చంద్రమౌళి నివాళులర్పించారు.

Updated Date - Aug 31 , 2025 | 12:12 AM