ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కూర్మ గ్రామంలో కలకలం

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:04 AM

ఆధ్యాత్మిక గ్రామంలో కూర్మలో కలకలం రేగింది. దుండగులు ఓ మందిరానికి నిప్పంటించడంతో కాలిబూడిదైంది. ఆధ్యా త్మిక ప్రసంగాలు చేసే రాధాకృష్ణ మందిరంలో మంగళ వారం అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

కాలి బూడిదైన ఆధ్యాత్మిక మందిరం
  • కాలిబూడిదైన ఆధ్యాత్మిక మందిరం

  • దుండగుల పనేనంటున్న నిర్వాహకులు

  • రూ.50లక్షల ఆస్తి నష్టమని అంచనా

హిరమండలం, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక గ్రామంలో కూర్మలో కలకలం రేగింది. దుండగులు ఓ మందిరానికి నిప్పంటించడంతో కాలిబూడిదైంది. ఆధ్యా త్మిక ప్రసంగాలు చేసే రాధాకృష్ణ మందిరంలో మంగళ వారం అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భక్తులు ఆందోళనతో పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలో మందిరం కాలిపోయింది. రూ.50లక్షల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలంలో దుండగుల ఆనవాళ్లు సేకరించేందుకు పోలీసులు క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దించారు. గురువారం తహసీల్దారు హనుమంతురావు, ఎంపీడీవో రఘుపాత్రుని కాళీప్రసాద్‌, కొత్తూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ చింతాడ ప్రసాద్‌, ఎస్‌ఐ ఎండీ యాసిన్‌ తదితులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. నిర్వాహకులు నుంచి వివరాలను తెలుసుకున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలకు దుండగులు పాల్పడ్డారని నిర్వాహకులు ప్రభుదాస్‌ వివరించారు. అగ్నిప్రమాదంలో విలువైన పుస్తకాలు, సామగ్రి కాలిపోయాయని, తీవ్రమైన నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తిం చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరావు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగలను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

Updated Date - Jun 13 , 2025 | 12:06 AM