ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Teachers transfors: గురువుల్లో గందరగోళం

ABN, Publish Date - May 24 , 2025 | 11:51 PM

Education department జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల పక్రియ సందడి మొదలైంది. తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో మండల విద్యాశాఖ కార్యాలయాల్లో సందడి కనిపిస్తోంది. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, ఏస్‌ఏలు బదిలీలకు శనివారంతో దరఖాస్తు గడువు ముగిసింది. కాగా దరఖాస్తుల సమయంలో లభించే పాయింట్లలో స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు గుర్రుమంటున్నారు.

నరసన్నపేటలో బదిలీల దరఖాస్తులను ఎంఈవోకు అందజేస్తున్న ఉపాధ్యాయులు
  • ప్రిఫరెన్షియల్‌ ఉపాధ్యాయులకు సింగిల్‌ పోస్టు నో చాన్స్‌

  • పాయింట్లు కేటాయింపుల్లో అస్పష్టత

  • ముగిసిన గేడ్ర్‌-2 హెచ్‌ఎం, ఎస్‌ఏల బదిలీల దరఖాస్తుల ప్రక్రియ

  • నరసన్నపేట, మే 24(ఆంధ్రజ్యోతి):

  • నరసన్నపేట మండలం బాడాం ఉన్నత పాఠశాలలో గణితం ఎస్‌ఏగా లుకలాపు నర్సింహమూర్తి పనిచేస్తున్నారు. ఈయన రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. 70 శాతానికిపైగా శారీరక వైకల్యం ఉంది. ఆ పాఠశాలలో ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేశారు. ప్రస్తుతం బదిలీల ప్రక్రియ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. ఈయనకు ప్రిఫరెన్షియల్‌ ఉన్నప్పటికీ.. సింగిల్‌ ఉపాధ్యాయ పోస్టు ఉన్న దగ్గర బదిలీపై వెళ్లేందుకు అవకాశం లేదు. పోనీ రెండు పోస్టులు ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్దామన్నా.. సర్దుబాటులో చాలాచోట్ల ఎస్‌ఏలు పోస్టులు సర్‌ప్లస్‌ మిగిలిపోయాయి. సింగల్‌ పోస్టు ఉన్న దగ్గర ఖాళీ ఉన్నా.. అవకాశం లేకపోవడంతో సూదూరం వెళ్లక తప్పడం లేదని నర్సింహమూర్తి ఆవేదన చెందుతున్నారు.

    ...................

  • జిల్లాలో ఉపాధ్యాయ బదిలీల పక్రియ సందడి మొదలైంది. తప్పనిసరిగా బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో మండల విద్యాశాఖ కార్యాలయాల్లో సందడి కనిపిస్తోంది. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, ఏస్‌ఏలు బదిలీలకు శనివారంతో దరఖాస్తు గడువు ముగిసింది. జిల్లాలో గ్రేడ్‌-2 హెచ్‌ఎం పోస్టులు 80 వరకు ఖాళీగా ఉండగా, సుమారు 200 మంది బదిలీలకు దరఖాస్తు చేశారు. అలాగే సుమారు 800 మందికి పైగా వివిధ సబ్జెక్టులకు చెందిన ఎస్‌ఏలు దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల సమయంలో లభించే పాయింట్లలో స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు గుర్రుమంటున్నారు.

  • హేతుబద్ధీకరణ(రేషలైజేషన్‌)కు గురైన ఉపాధ్యాయులకు పాత పాఠశాల పాయింట్లు రావాల్సి ఉంది. అయితే వారికి పాతస్టేషన్‌ పాయింట్లు రావడం లేదు

  • 2017లో బదిలీ అయినా.. మళ్లీ ఈఏడాది తప్పనిసరిగా బదిలీకి దరఖాస్తు చేసుకోవాలని జీవో జారీ చేశారు. అయితే వీరికి 8 ఏళ్లకు చెందిన స్టేషన్‌ పాయింట్లు రావడం లేదు. వీరికి ఏడాది మూడు పాయింట్లు చొప్పున 24 రావాల్సి ఉండగా, 23.5 రావడంతో ఉపాధ్యాయులు అసహనం చెందుతున్నారు.

  • ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో బదిలీపై వెళ్లేవారిలో చాలామంది ఉపాధ్యాయులకు కష్టాలు తప్పడం లేదు. కేటగిరి 3,4 పోస్టుల్లో ప్రిఫరెన్షియల్‌ ఉపాధ్యాయులకు 50శాతం పోస్టులు ఖాళీగా ఉన్న దగ్గరకు బదిలీకు అవకాశం ఇచ్చారు. అలాగే ఎస్జీటీలకు అయితే మూడో పోస్టు ఉన్న దగ్గర మాత్రం అవకాశం ఇచ్చారు. కాగా.. జిల్లాలో ఎస్జీటీ మూడో పోస్టు ఉన్న పాఠశాలలు చాలా తక్కువ. దీంతో కొంతమంది ఈ కేటగిరి కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

  • 2023లో పదోన్నతి మీద వెళ్లిన ఎస్‌ఏలు ప్రస్తుతం రేషన్‌లైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు పాత స్టేషన్‌ రాక గగ్గోలు చెందుతున్నారు.

  • సజావుగా చేపట్టాలి

    ఉపాధ్యాయులు బదిలీల పక్రియ ఎటువంటి గందోరగోళానికి గురికాకుండా సజావుగా చేపట్టాలి. ఇరవై రోజులు పాటు చేపట్సాలిన తంతును వారం రోజుల్లో హడావుడిగా ముగిస్తున్నారు. ప్రిఫరెన్షియల్‌ కేటగిరి వారికి రెండో పోస్టు, మూడో పోస్టు ఉన్న వద్ద కేటాయించడం తగదు. జిల్లాలో రెండో, మూడో పోస్టులు ఉన్న పాఠశాలలు చాలా తక్కువ. వారికి అన్యాయం జరుగుతోంది.

    - బమ్మిడి శ్రీరామ్మూర్తి, యూటీఎఫ్‌, ప్రధాన కార్యదర్శి

Updated Date - May 24 , 2025 | 11:51 PM