ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పెండింగ్‌ రైల్వే పనులు పూర్తి చేయండి

ABN, Publish Date - Jul 12 , 2025 | 11:39 PM

శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

అధికారులతో సమీక్షిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

శ్రీకాకుళం, జూలై 12(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై శనివారం వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎంతో విశాఖపట్నంలో ప్రత్యే కంగా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల రద్దీ దృష్ట్యా శ్రీకాకుళం నుంచి నేరుగా హైద రాబాద్‌, తిరుపతికి నూతన రైలు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘అమృత్‌ భారత్‌’లో నిర్వహిస్తున్న స్టేషన్ల అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. శ్రీకాకుళం, నౌపడ స్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని.. పనుల్లో ఎటువంటి ఆలస్యం కూడ దని ఆదేశించారు. రైల్వే జోన్‌ పనుల పురోగతిపై చర్చిం చారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే మంజూ రైన 18 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నా రు. గతిశక్తి పథకం కింద నేషనల్‌ హైవే 16కు అను సంధానంగా ఉన్న ‘హరిశ్చంద్రపురం’ రైల్వే స్టేషన్‌ వద్ద సరుకుల రవాణాకు ఉపయోగపడేలా లాజి స్టికల్‌ పార్క్‌ అభివృద్ధి చేయాలన్నారు. పాతపట్నం స్టేషన్‌లో రాజారాణి ఎక్స్‌ప్రెస్‌కు, పొందూరు, శ్రీకా కుళం నుంచి పూండి వరకు స్టేషన్‌లో మరిన్ని రైళ్ల కు స్టాప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీకా కుళం జిల్లా మీదుగా పూరి-తిరుపతి, భువనేశ్వర్‌- విజయవాడ వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రతి పాదన లను చేశారు. శ్రీకాకుళం జిల్లా రైల్వే అభివృద్ధికి తన వంతు బాధ్యత వహిస్తానని మంత్రి రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌ఎం లలిత్‌ బోహ్రా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:39 PM