యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:02 AM
నిరంతర యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు.
కవిటి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): నిరంతర యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అన్నారు. కొత్తపాలెం సముద్రతీరంలో మండల అధికారులు, సిబ్బంది, స్థానికులు దాదాపు 500మందితో మంగళవారం యోగాంధ్ర నిర్వ హించారు. ప్రతీ ఒక్కరూ ప్రతీరోజూ కొంత సమయాన్ని కేటాయించి యోగాను నిత్య ప్రక్రియగా చేసుకోవాలన్నారు. ఈ సందర్భం గా ఈగల్ టీం పోస్టర్‌ను ఆవిష్కరించారు. మత్తుపదార్థాల నివారణకు ప్రభుత్వం ఈగల్‌టీంను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.మురళీమోహన్, ఎస్‌ఐ వి.రవివర్మ, మండల పరిషత్, వ్యవసాయ, ఉపాధిహామీ, వెలుగు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం, జూన్ 3(ఆంధ్ర జ్యోతి): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని తహసీల్దార్ ఎన్.వెంకట రావు అన్నారు. డొంకూరు సముద్రం ఒడ్డున రెండు గంటల సేపు యోగాసనాలు వేశారు. మంగళవారం ఉదయం 6.30 గంటల నుంచి రెండు గంటల పాటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కలిసి యోగా విన్యాసాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామారావు, ఐసీడీఎస్ పీవో నాగరాణి, ఏపీఎం ఎస్.ప్రసాద్, యోగా టీచర్స్, నాయకులు సాడి సహదేవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 12:02 AM