ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం

ABN, Publish Date - May 25 , 2025 | 11:29 PM

యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయుష్‌ అధికారి డాక్టర్‌ పి.జగదీష్‌ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం యోగపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సాధన చేస్తున్న నగరవాసులు

అరసవల్లి, మే 25(ఆంధ్రజ్యోతి): యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయుష్‌ అధికారి డాక్టర్‌ పి.జగదీష్‌ అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం యోగపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక జీవన శైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నా రన్నారు. యోగ, ధ్యానం సాధన చేయడం ద్వారా వీటిని దూరం చేయొచ్చన్నారు. వచ్చే నెల 21వ తేదీ వరకు యోగపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రోజూ ఒక గంట సాధన చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు నిర్వహించిన ఈ శిక్షణలో 150 మంది వరకు పాల్గొని సాధన చేశారు. కార్యక్రమంలో మెప్మా పీడీ, సిబ్బంది, ఆయుష్‌ సిబ్బంది, యోగ శిక్షకులు మురళి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

పొందూరులో..

పొందూరు, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రతీరోజు యోగా సాధన ద్వారా ఆరోగ్యం పొందడమే కాకుండా మానసిక ఆనందం పొందవచ్చని డాక్టర్‌ సునీల్‌కుమార్‌, ఎంఈవో పి.రాజారావు అన్నారు. ఆయుష్‌ డిపార్టమెంట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం మండల కేంద్రంలో యోగపై అవగాహన కల్పించారు. స్థానిక జాలీ వాకర్స్‌క్లబ్‌ సభ్యులతో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో వాకర్స్‌క్లబ్‌ సభ్యులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 11:29 PM