ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్‌ఆర్‌ఐల వివరాలు సేకరించండి: సీఈవో

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:01 AM

పంచాయతీలు అభివృద్ధికోసం తప్పనిసరిగా ప్రణాళికలను రూపొందించుకోవాలని జడ్పీ సీఈవో శ్రీధరరాజు తెలిపారు. సోమవారం ఎల్‌.ఎన్‌.పేటలో ఎంపీడీవో పి.శ్రీనివాసరావు అధ్యక్షతన మండల అధికారులు, గ్రామ సచి వాలయాల సిబ్బందితో పంచాయతీ పురోగతి సూచికపై సమీక్షించారు.

మాట్లాడుతున్న శ్రీధర్‌రాజు

ఎల్‌.ఎన్‌.పేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): పంచాయతీలు అభివృద్ధికోసం తప్పనిసరిగా ప్రణాళికలను రూపొందించుకోవాలని జడ్పీ సీఈవో శ్రీధరరాజు తెలిపారు. సోమవారం ఎల్‌.ఎన్‌.పేటలో ఎంపీడీవో పి.శ్రీనివాసరావు అధ్యక్షతన మండల అధికారులు, గ్రామ సచి వాలయాల సిబ్బందితో పంచాయతీ పురోగతి సూచికపై సమీక్షించారు. శాఖల వారీగా అధికారులు గ్రామాల్లో అభివృద్ధి పనులను గుర్తించి పంచాయతీరాజ్‌శాఖ యాప్‌లో రెండురోజుల్లో అప్‌లోడ్‌చేయాలన్నారు. గ్రామాలో ఉన్న నాన్‌ రెసిడెన్షియల్‌ ఇండియన్స్‌(ఎన్‌ఆర్‌ఐ)ను గుర్తించి వారి ఫోన్‌నెంబర్లతోపాటువివరాలను రెండురోజుల్లో సేకరించాలన్నారు.సమావేశంలో తహసీల్దార్‌ జె.ఈశ్వరమ్మ, ఈవోపీఆర్డీ పి.శ్రీనివాసులు, బి. రమేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫమెళియాపుట్టి, జూలై 14( ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకురావడానికి సహకరించాలని జడ్పీ సీఈవో శ్రీధర్‌రాజ్‌ కోరారు. మెళియాపుట్టిలో వీఆర్వోలు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.పాపారావు, ఎంపీడీవో ప్రసాద్‌పండా, ఈవోపీఆర్డీ తారకేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:01 AM