ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Coconut Price : ధర భళా.. దిగుబడి డీలా

ABN, Publish Date - Jun 13 , 2025 | 12:02 AM

Coconut Price Low Yield కొబ్బరి ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. దిగుబడి మాత్రం నేలచూపులు చూస్తోంది. కాయలు ధర రికార్డుస్థాయిలో పలుకుతుంటే.. అదే స్థాయిలో ఉత్పత్తి పతనమవుతోంది. ధర ఉన్నా అమ్మకానికి పంట లేకపోవటంతో ఉద్దానం రైతులు దిగాలు పడుతున్నారు.

ఉద్దానంలో విక్రయానికి సిద్ధం చేస్తున్న కొబ్బరికాయలు
  • రికార్డు స్థాయికి కొబ్బరి ధరలు

  • వెయ్యికాయలు రూ.25వేలు

  • పంట లేక రైతుల దిగాలు

  • కవిటి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): కొబ్బరి ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. దిగుబడి మాత్రం నేలచూపులు చూస్తోంది. కాయలు ధర రికార్డుస్థాయిలో పలుకుతుంటే.. అదే స్థాయిలో ఉత్పత్తి పతనమవుతోంది. ధర ఉన్నా అమ్మకానికి పంట లేకపోవటంతో ఉద్దానం రైతులు దిగాలు పడుతున్నారు. వాస్తవానికి వేసవి సీజన్‌లో కొబ్బరికాయల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. కానీ, గత మూడేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావం పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికితోడు తెల్లదోమ, నల్లముట్టి తెగుళ్లతో కొబ్బరి చెట్లు నామరూపాల్లేకుండా మారిపోయాయి.

  • 100 కాయలు.. గగనం

  • ప్రస్తుతం ఎకరా కొబ్బరి తోట నుంచి వంద కాయలు దిగుబడి రావటం గగనంగా మారింది. గతంలో ఇదే తోట ద్వారా 300 వరకు కాయలు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో వెయ్యి కాయలు రూ.25వేలు పలుకుతున్నాయి. రిటైల్‌లో మాత్రం ఒక్కో కాయ రూ.30 నుంచి 35 వరకు పలుకుతోంది. కొబ్బరిబొండాలను చెట్ల నుంచి తీసి అమ్మకాలు సాగించేందుకు రైతులు ససేమిరా అంటారు. కానీ, అరకొరగా లభ్యమయ్యే వాటి ధరలు మాత్రం అధికంగానే ఉన్నాయి. ఒక్కో కాయ రూ.30నుంచి రూ.40 పలుకుతోంది. పండుగలు, వేసవి సీజన్‌లో ధరలు పెరుగుతుంటే రైతులు ఆనందపడేవారు. కానీ, గత మూడేళ్లుగా సరైన వర్షాలు కురవక, కొబ్బరి చెట్లకు నీటితడులు లేక దిగుబడి దిగజారింది.

  • ఒడిశా వ్యాపారులే దిక్కు

  • ఉద్దానం కొబ్బరికి సంబంధించి గతంలో కంచిలి ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇక్కడి మార్కెట్‌ నుంచి ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు కొబ్బరి కాయలను ఎగుమతి చేసేవారు. దీనికి అనుబంధంగా కొబ్బరి పీచు, పుల్లల వ్యాపారాన్ని నిర్వహించేవారు. కాలక్రమంలో ఉద్దానంలో ప్రకృతి విలయాలకు కొబ్బరి పంట పూర్తిగా నాశనం కావడం, చీడ పీడలు, తెగుళ్లతో కాయల నాణ్యత, దిగుబడి తగ్గింది. ఆ ప్రభావం ప్రత్యక్షంగా కొబ్బరి మార్కెట్‌పై, పరోక్షంగా పీచు పరిశ్రమలపై పడింది. మొదట్లో వాటిని ఎలాగో యజమానులు నెట్టుకొచ్చారు. రానురాను నష్టాలు ఎక్కువ కావడంతో భరించలేక పరిశ్రమలను మూసివేశారు. 2018 తితలీ తుఫాన్‌ తర్వాత తమ వ్యాపారాలకు స్వస్తి పలికారు. దీంతో ఒడిశా వ్యాపారులే ఉద్దానం ప్రాంతానికి పెద్ద దిక్కుగా మారారు. ప్రస్తుతం ఈప్రాంతంలో దిగుబడి లేకపోవటంతో దళారులు కోనసీమ, తమిళనాడు కాయలను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువస్తున్నారు. వాటిని ఉద్దానం తోటల్లో నిల్వ చేస్తున్నారు. ఈప్రాంత కాయలుగా చెప్పి వ్యాపారులకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో వ్యాపారులు ఉద్దానం వైపునకు రావడం మానుకున్నారని రైతులు చెబుతున్నారు

  • కోలుకోని ఉద్దానం కొబ్బరి

  • ఉద్దానం ప్రాంతంలోని తోటలకు వర్షాధారమే ప్రధాన నీటివనరు. అధికంగా వర్షాలు పడితే కొబ్బరి రైతు ఆనందానికి అవధులు ఉండవు. ఈ ప్రాంతంలోని కొబ్బరి చెట్లన్నీ పొడవాటి(టాల్‌స్టాయి) రకానికి చెందివే. దీంతో ఈదురుగాలులు, తుఫాన్లు వచ్చిన సమయంలో అధిక చెట్లు నేలకూలుతున్నాయి. 1999 నుంచి ఉద్దానంపై ప్రకృతి ప్రకోపం చూపుతోంది. ఆ ఏడాది ప్రారంభమైన పెనుతుఫాన్ల పరంపర 2018లో ‘తితలీ’ వరకు కొనసాగింది. వేలాది చెట్లు నేలకొరిగాయి. మళ్లీ కొత్తగా మొక్కలు నాటిన పదేళ్లకు గానీ దిగుబడి అందించవు. ఈ తరుణంలో కాండం తొలుచు పురుగు, తెల్లదోమ, నల్లముట్టి తెగుళ్లు చెట్ల ఎదుగుదల, దిగుబడిపై ప్రతాపాన్ని చూపుతున్నాయి. మొక్కలను కాపాడుకోవటానికే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

Updated Date - Jun 13 , 2025 | 12:02 AM