12 కుటుంబాలకు సీఎం సహాయనిధి అందజేత
ABN, Publish Date - Jul 31 , 2025 | 12:10 AM
నియోజకవర్గ పరిధిలోని 12 కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందచేశారు.
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట/ పోలాకి, జూలై 30(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలోని 12 కుటుంబాలకు సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందచేశారు. పోలాకి గ్రామానికి చెందిన గూనపుజ్యోతికి రూ.83,311, బెలమర పాలవసలకు చెందిన గొర్లె ఆకాష్‌కు రూ.30,000, చెల్లాయివలసకు చెందిన బమ్మిడి రోహిణికి రూ.21,600, గుప్పెడుపేటకు చెందిన మంకు శ్రీనుకు రూ41,580, మడపాం గ్రామానికి చెందిన తాండ్రపు గున్నమ్మకు రూ.10,2620, బుచ్చిపేటకు చెందిన కొన్న భువనేశ్వర్‌కు రూ2,83,399, గేదెల రమణమూర్తికి రూ40.610, వడ్డి కావ్యకు రూ.1,37,784, పొట్నూరు సంధ్యారాణికి రూ.15,000, శాసనాపురం దానేశ్వరరావుకు రూ.30,000, మెండ నరసమ్మకు రూ45,895, సారవకోట మండలం డోల రోహిణికి రూ.23,400 చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బగ్గు అర్చన, నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, నాయకుడు గొద్దు చిట్టిబాబు, బలగ ప్రహార్ష, గోపి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2025 | 12:10 AM