సీఎం చంద్రబాబు రైతు పక్షపాతి
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:05 AM
రాష్ట్రంలో రైతుల సాగుకు అవస రమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు తెలు గుదేశం పార్టీ పాలనలోనే అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా యుడు రైతు పక్షపాతిగా గుర్తింపు పొందారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, జూన్ 4(ఆంధ్రజ్యో తి): రాష్ట్రంలో రైతుల సాగుకు అవస రమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు తెలు గుదేశం పార్టీ పాలనలోనే అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా యుడు రైతు పక్షపాతిగా గుర్తింపు పొందారని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. బుధవారం దూసిపేట గ్రామంలో ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాలొని మాట్లాడారు. మండ ల వ్యవసాయాధికారి ఎం.మోహన్‌రావు ఆధ్వర్యంలో 2025 ఖరీఫ్‌సాగునకు రైతులకు రాయితీపై అందించే వరి విత్తనాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ ప్రారంభిం చారు. ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ.. సాగులో కొత్త విధానాలు అవలంభించాలని, కొత్త వంగడాలను వాడాలన్నా రు. వ్యవసాయంలో వాడకాన్ని, డ్రోన్స్ వినియోగం ద్వారా రైతులకు కలిగే లాభాలను డ్రోన్ ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. రైతన్నలు వ్యవసాయంలో పాత విధానాలను విడిచిపెట్టి కొత్త యాంత్రీకరణ పద్దతులపై దృష్టి పెట్టాలని, తద్వారా మంచి దిగుబడులు రాబట్టుకోవచ్చునని వ్యవ సాయాఽధికారులు అందించే సూచనలు పాటిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే కో-ఆర్డినేటర్ కె.భాగ్యలక్ష్మి, నారాయణపురం ఆనకట్టు చైర్మన్ సనపల ఢిల్లీశ్వరరావు, రా ష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్, టీడీపీ నాయకులు తమ్మినేని అప్పలనాయుడు, ఎండ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 12:05 AM