ఇరువర్గాల మధ్య కొట్లాట
ABN, Publish Date - May 12 , 2025 | 11:51 PM
స్థానిక నెహ్రూనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో బి.గోపి అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి.
హత్యాయత్నం కేసు నమోదు
పలాస, మే 12(ఆంధ్రజ్యోతి): స్థానిక నెహ్రూనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాటలో బి.గోపి అనే వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. తనను హతమార్చేందుకు ప్రత్యర్థులు వచ్చారని, తప్పించుకోగా తలకు తీవ్రగాయమైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యా యత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. నెహ్రూనగర్‌లో నివాసం ఉంటున్న గోపి తప్పతాగి తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆ వీధిలోనే నివసి స్తున్న రవి భార్య 100కు ఫోన్ చేశారు. ఈ మేరకు పోలీసులు అక్కడికి చేరు కున్నారు. ఉద్దేశపూర్వకంగా తనపై ఫిర్యాదు చేశారని గోపి పోలీసులకు చెబు తూ స్టేషన్‌కు వెళు తున్న క్రమంలో చీకటిలో కాపుకాచిన బి.రవి, వి.భర ద్వాజ్, వి.లక్ష్మణ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గోపి తల, కన్నుపై తీవ్ర గాయాల య్యాయి. ఈ మేరకు క్షతగాత్రుడ్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇరువర్గాలు దాడి చేసుకున్న వారంతా రక్తసంబం ధీకు లేనని తెలుస్తోంది. పాత కక్షల కారణంగా ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ మద్దతుదారుడైన గోపిపై దాడి జరిగిన విషయం తెలుసు కున్న ఆ పార్టీ నాయకులు బడ్డ నాగరాజు, సప్ప నవీన్, ఎ.రామకృష్ణ ఆసుపత్రిలో పరామర్శించారు. గోపికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - May 12 , 2025 | 11:51 PM