మహిళ బ్యాగ్‌లో గొలుసు చోరీ
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:00 AM
శ్రీకాకుళం నగరానికి చెందిన కోరాడ రామలక్ష్మి భర్తతో చిలకపాలెంలోని వివాహానికి వెళ్లి గురువారం ఆటోలో తిరుగు వస్తున్న సమయంలో శ్రీకాకుళం పీఎన్‌కాలనీలోకి ప్రవే శించేసరికి ఆమె మెడలో గొలుసు తెగిపోయింది.
శ్రీకాకుళం క్రైం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరానికి చెందిన కోరాడ రామలక్ష్మి భర్తతో చిలకపాలెంలోని వివాహానికి వెళ్లి గురువారం ఆటోలో తిరుగు వస్తున్న సమయంలో శ్రీకాకుళం పీఎన్‌కాలనీలోకి ప్రవే శించేసరికి ఆమె మెడలో గొలుసు తెగిపోయింది. ఆమె భర్త డ్రైవర్ పక్క సీటులో కూర్చోగా మరో ఇద్దరు గుర్తుతెలియని మహిళలు రామలక్ష్మి పక్క న కూర్చొన్నారు. ఆమె గొలుసు తెగిపోయిందని గమనించి ఆ ఇద్దరు మహిళలు బ్యాగ్‌లో వేసుకోవాలని సూచించారు. వారు అదే కాలనీ జంక్షన్‌కు వచ్చే సరికి ఆటో దిగిపోయారు. అనం తరం సదరు మహిళ లక్ష్మీటాకీస్ వద్దకు వచ్చేసరికి బ్యాగ్‌ను చూసుకునేసరికి బ్యాగ్ కత్తిరించి ఉండడంతో ఒక్కసారిగా అవాక్కయింది. గొలుసు చోరీ జరిగిందని గమ నించి వెంటనే రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీసీ పుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
రెండు తులాల బంగారం అపహరణ
కొత్తూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): బలద గ్రామంలో కంచరం పురుషోత్తం ఇంటిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొర బడి తాళాలు పగలు గొట్టి బీరువాలోని రెండు తులాల బంగారు ఆభర ణాలను చోరీ చేసినట్లు సీఐ సీహెచ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం బంధువుల వివాహానికి పురుషోత్తం కుటుంబ సభ్యులతోకలిసి వెళ్లారు. అయితే గురు వారం తెల్లవారుజామున ఇంటి తలుపులు తీసి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆయనకు సమాచారం ఇవ్వడంతో వచ్చి పరిశీ లించి చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు పురుషోత్తం ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలను సేకరించారు.
Updated Date - Jun 06 , 2025 | 12:00 AM