ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పడిపోయిన జీడిపప్పు అమ్మకాలు

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:14 AM

జీడిపిక్కల ధరలు పెరగడంతో ఆశించిన స్థాయిలో పప్పు అమ్మకాలు జరగడం లేదు. దీంతో జీడి పరిశ్రమలు తీవ్ర నష్టా లు చవిచూస్తున్నాయి. పరిశ్రమల్లో పప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి.

ఓ జీడి పరిశ్రమలో పేరుకుపోయిన జీడిపప్పు నిల్వలు
  • పరిశ్రమల్లో పేరుకుపోయిన నిల్వలు

  • ఆశించిన స్థాయిలో జరగని విక్రయాలు

  • నష్టాల్లో జీడి వ్యాపారులు

  • అధిగమించేందుకు ఈ నెల 14 వరకు బంద్‌

పలాస, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): జీడిపిక్కల ధరలు పెరగడంతో ఆశించిన స్థాయిలో పప్పు అమ్మకాలు జరగడం లేదు. దీంతో జీడి పరిశ్రమలు తీవ్ర నష్టా లు చవిచూస్తున్నాయి. పరిశ్రమల్లో పప్పు నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలు బంద్‌ పాటిస్తే కుదుటపడొచ్చని జీడి వ్యాపారులు భావిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకూ పరిశ్రమ లు బంద్‌ పాటించి ఉన్న నిల్వలు అమ్మకాలు చేపట్ట డం ద్వారా నష్టాన్ని భర్తీ చేసేందుకు వ్యాపారులు చర్యలు చేపట్టారు. దీంతో మొత్తం రెండు వారాల పాటు జీడి పరిశ్రమలు బంద్‌ పాటిస్తున్నామని, వ్యా పారులు, కార్మికులు తమకు సహకారం అందించాల ని జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. సాధారణంగా జూలైలో జీడి పప్పు అమ్మకాలు మందకొండిగా జరు గుతుంటాయి. ప్రస్తుతం పలాస మార్కెట్‌లో అన్నీ ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయడంతో ఉత్పత్తి సామర్థ్యం అమాంతం పెరిగిపోయింది. అందుకు త గిన అమ్మకాలు లేకపోవడం, ముఖ్యంగా నార్త్‌ఇండి యా ప్రాంతంలో జీడి పప్పుకు గిరాకీ తగ్గడంతో పలాస జీడికి మార్కెట్‌ లేకుండా పోయింది. దీనికి తోడు జీడి పిక్కల ధరలు కూడా బస్తా రూ.13,500 వరకూ ఉండడంతో దా నికి అనుగుణంగా పప్పు ధరలు పెరగలేదు. దీంతో వ్యాపారులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపఽథ్యంలో కార్మికులు, వ్యాపారులతో చ ర్చించిన మీదట రెండు వారాలు బంద్‌కు పి లుపునివ్వడంతో సోమవారం నుంచి జీడి ప రిశ్రమలు మూసివేశారు.

నష్టాలు అధిగమించేందుకే..

ఈ వ్యవహారంపై పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉత్పత్తికి తగిన విధంగా అమ్మకాలు లేకపోవడం వల్ల చిన్న జీడి పరిశ్రమలు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయన్నారు. దీన్ని అధికమించాలంటే బంద్‌ పాటించి రెండు వారాల పాటు పరిస్థితి చూడడం జరుగుతుందన్నా రు. మార్కెట్‌లో ధరలు పెరిగితే పరిశ్రమలు యథా తథంగా తెరవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఆధునిక యంత్రాలు పరిశ్రమల్లో నెలకొల్పడం వల్ల ఉత్పత్తి అమాంతంగా పెరిగిపోయిందని, ప్రస్తుతం అన్నీ పరిశ్రమల్లో జీడి పప్పు నిల్వలు భారీ స్థాయిలో పేరుకుపోయావన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:14 AM