విద్యార్థుల సైకిళ్లకు నగదు పంపిణీ
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:51 PM
దూసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదు వుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయులు సొంత నిధులతో సైకిళ్లు కొనుగోలుకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఒక్కో విద్యా ర్థికి రూ.5 వేలు వంతున మొత్తం 12 మందికి నగదును ఆది వారం డీఈవో తిరుమల చైతన్య ఆధ్వర్యం లో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులకు అందజేశారు.
ఆమదాలవలస, జూలై 20 (ఆంధ్రజ్యోతి): దూసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదు వుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఉపాధ్యాయులు సొంత నిధులతో సైకిళ్లు కొనుగోలుకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఒక్కో విద్యా ర్థికి రూ.5 వేలు వంతున మొత్తం 12 మందికి నగదును ఆది వారం డీఈవో తిరుమల చైతన్య ఆధ్వర్యం లో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులకు అందజేశారు. తోటాడ, అక్కివరం పంచాయతీలకు చెందిన 12 మంది విద్యార్థులు దూసి హైస్కూల్‌కు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నందున ఉపాధ్యాయులు సైకిళ్లను కొనుగోలు చేసి ఇవ్వాలని భావించడం అభినం దనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవి కుమార్, డీఈవో తిరుమల చైతన్య, ఎంఈవో రాజేంద్ర ప్రసాద్ ఉపాధ్యాయులను అభినం దించారు.
Updated Date - Jul 20 , 2025 | 11:51 PM