మధ్యవర్తిత్వం ద్వారా కేసులు రాజీ చేసుకోవాలి
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:28 PM
ఇరు పార్టీలకు మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోనాలు వివరించి కేసులు రాజీ చేసుకోవాలని టెక్కలి సీనియర్ సివిల్ న్యాయాధికారి, మండల న్యాయ సేవాధికార సంఘం చైర్‌పర్సన్ బి.నిర్మల కోరారు.
టెక్కలి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఇరు పార్టీలకు మధ్యవర్తిత్వం వల్ల కలిగే ప్రయోనాలు వివరించి కేసులు రాజీ చేసుకోవాలని టెక్కలి సీనియర్ సివిల్ న్యాయాధికారి, మండల న్యాయ సేవాధికార సంఘం చైర్‌పర్సన్ బి.నిర్మల కోరా రు. మంగళవారం టెక్కలిలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులు, కోర్టు, పోలీస్ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్లతో అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. కార్యక్రమంలో బార్‌అసోసి యేషన్ అధ్య క్షుడు పినకాన అజయ్‌కుమార్, మధ్యవర్తిత్వం పై శిక్షణ పొందిన మీడియేటర్స్ డీవీ వివేకా నంద, ఎస్.దివాకర్, ఎ.వైకుంఠరావు, డి.భుజంగ రావు, ప్యానెల్ న్యాయవాది మెట్ట గోవింద్, ఎస్ ఐలు కె.రాము, షేక్‌మహ్మద్ ఆలీ, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
కోటబొమ్మాళిలో..
కోటబొమ్మాళి, జూలై 15(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకో వాలని న్యాయవాదుల సంఘం మండల అధ్యక్షు డు లఖినేని శ్రీనివాసులు తెలిపారు. మంగళ వారం కోటబొమ్మాళిలోని కోర్టు ఆవరణలో కక్షిదా రులతో సమావేశం నిర్వహించారు. కార్య క్రమం లో న్యాయవాదులు డి.నర్సింహ మూర్తి, పూజా రి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
కేసుల భారం తగ్గించేందుకే..
పొందూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): రోజు రోజుకూ పెరిగిపోతున్న కేసులు, కోర్టుల్లో పెండింగ్ కేసుల ను తగ్గించేందుకే సుప్రీంకోర్టు ‘మధ్యవర్తిత్వం- దేశం కోసం’ కార్యక్రమాన్ని నిర్వ హిస్తోందని స్థానిక జూనియర్ సివిల్ న్యాయా ధికారి బి.జ్యోత్స్న అన్నారు. ఈ మేరకు దీనిపై అవగాహన కలిగించేందుకు మంగళవారం పట్ట ణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంతో కక్షిదారు లకు కేసుల నుంచి విముక్తితో పాటు ఆర్థిక ఉపశమనం కలుగుతుందన్నారు. ప్రతి శుక్ర, సోమ వారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా మని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో న్యాయవాదులు కె.అశోక్, వై. బ్రహ్మాజీ, పి.రామ్మో హన్, కె.మంజుల, సురే ష్, కోర్టు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 11:28 PM