మధ్యవర్తిత్వంతో కేసులు రాజీ చేసుకోవాల
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:55 PM
మధ్యవర్తిత్వంతో కేసులు రాజీ చేసుకోవాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల కోరారు. సోమవారం టెక్కలి కోర్టు సముదాయంలో కక్షిదారులకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ 90 రోజుల పాటు మధ్యవర్తిత్వంపై ప్రత్యేక కార్యక్రమా లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
టెక్కలి, జూలై 14(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంతో కేసులు రాజీ చేసుకోవాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల కోరారు. సోమవారం టెక్కలి కోర్టు సముదాయంలో కక్షిదారులకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ 90 రోజుల పాటు మధ్యవర్తిత్వంపై ప్రత్యేక కార్యక్రమా లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఫ నరసన్నపేట, జూలై 14(ఆంధ్రజ్యోతి): మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరించేందుకు కక్షిదారులకు మరింత అవగాహన పెంచాలని స్థానిక జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎస్.వాణి తెలిపారు. సోమవారం నరసన్నపేటలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీపీ సంతోషి, సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సీఐ రమణ, ఎస్‌ఐలు దుర్గాప్రసాద్, రంజిత్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రావాడ కొండలరావు, సభ్యులు రోణంకి కృష్ణంనాయుడు, యాళ్ల నర్సింగరావు, జీవీ రమణ, జామి కామేశ్వరరావు, వాన శ్రీనివాసరావు, గొండు అప్పారావు పాల్గొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:55 PM