ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొట్లాటలో ఆరుగురిపై కేసు నమోదు

ABN, Publish Date - May 28 , 2025 | 12:07 AM

ఇరువర్గాల కొట్లాటలో ఆరుగురి పై కేసు నమోదు చేసినట్లు శ్రీకాకుళం టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు మంగ ళవారం తెలిపారు.

శ్రీకాకుళం క్రైం, మే 27(ఆంధ్రజ్యోతి): ఇరువర్గాల కొట్లాటలో ఆరుగురి పై కేసు నమోదు చేసినట్లు శ్రీకాకుళం టూటౌన్‌ సీఐ ఈశ్వరరావు మంగ ళవారం తెలిపారు. సీఐ కథనం మేరకు.. శ్రీకాకుళంలోని డేఅండ్‌ నైట్‌ కూడలి వద్ద ఉన్న ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద పలాసకు చెందిన నాగబాల నిల్చొని ఉన్నారు. ఆ సమయంలో శ్రీకాకుళం పెద్ద రెల్లివీధికి చెందిన షణ్ముఖ శ్రీను ద్విచక్ర వాహనంపై వచ్చి నాగబాలను ఢీకొనడంతో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అయితే ఇరు వర్గాలకు చెందిన మరికొందరు వ్యక్తులు అదే బార్‌లో అప్పటికే మద్యం సేవించి ఉండడంతో ఘర్షణకు దారి తీసి, ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. వీరిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రెండో పట్టణ సీఐ ఈశ్వరరావుకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం కొట్లాటకు కారణమైన వారిని గుర్తించి, ఆరుగురిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు.

Updated Date - May 28 , 2025 | 12:07 AM