నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు చేపట్టండి
ABN, Publish Date - Jul 21 , 2025 | 11:43 PM
నిమ్మతొర్లాడ వద్ద ఇసుక ర్యాంప్ తవ్వకాలు నిబంధనల మేరకు చేపట్టాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష ఆదేశిం చారు.
ఆర్డీవో సాయి ప్రత్యూష
ఆమదాలవలస, జూలై 21 (ఆంధ్రజ్యోతి): నిమ్మతొర్లాడ వద్ద ఇసుక ర్యాంప్ తవ్వకాలు నిబంధనల మేరకు చేపట్టాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష ఆదేశిం చారు. ఆదివారం అర్థరా త్రి ఇసుక ర్యాంప్ నిర్వాహకులకు గ్రామస్థులకు మధ్య వివా దం జరగడంతో సోమవారం ఇరిగే షన్ ఈఈ కొన్నాడ సుధాకర్‌తో కలిసి ఆమె విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో శ్మశాన వాటిక, పశువుల మేత ప్రదేశం, యువకులు ఆటలాడు కునేందుకు ఉపయోగిస్తున్నామని, ఈ ప్రదేశం మధ్య నుంచి వాహనాల రాకపోకలకు రోడ్డు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఈ మూడు ప్రదేశాలను విడిచిపెట్టి ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఆర్డీవో నిర్వాహకులకు సూచించారు. ఈ వివాదం దృష్ట్యా ఆమదాల వలస సీఐ పి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. నిబంధనలకు విరు ద్ధంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంప్‌ను మూసి వేయాలని వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Updated Date - Jul 21 , 2025 | 11:43 PM