సొంత లాభం ఎంతో చూసుకొని..
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:49 PM
ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచా లని ఓ వైపు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. ఒకప్పుడు వంద పడకల ఏరియా ఆసుపత్రిగా ఉన్నప్పుడు నెలకు 120కు పైగా ప్రసవాలు జరిగాయి.
టెక్కలి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచా లని ఓ వైపు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. ఒకప్పుడు వంద పడకల ఏరియా ఆసుపత్రిగా ఉన్నప్పుడు నెలకు 120కు పైగా ప్రసవాలు జరిగాయి. నేడు ఆసుపత్రి స్థాయి పెంచి... సౌకర్యాలు కల్పిం చి.. 200 పడకల స్థాయికి పెరిగిన తరువాత ప్రసవాల సంఖ్య నెలకు 90 లోపలికి పడిపోయింది... ఇదీ టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సేవల దుస్థితి. గతంలో ఇదే ఆసుపత్రిలో గైనకాలజీ వైద్యులు తక్కువగా ఉన్నా... ప్రసవాల సంఖ్య మాత్రం వంద దాటేఉండేది. నేడు గైనకాలజీ వైద్యులు నలుగురు ఉన్నప్పటికీ జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు సమాంతరంగా ప్రైవేట్ క్లినిక్‌లు నడుపుతుండడం విశేషం. ఆసుపత్రికి వచ్చే గర్భిణులను గుర్తించి... ముందుగాకొందరు దళారుల ద్వారా వారితో మాట్లాడి... ప్రైవేటు క్లినిక్‌లకు ప్రసవాలకు వెళ్లేలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్ర ఆసు పత్రిలో నెలకు సుమారు 400 వరకు గర్భిణులకు స్కానింగ్, ఇతర పరీక్షలు జరుగుతు న్నా ప్రసవాలకు వచ్చేసరికి 90 లోపలే ఉండడం ఇక్కడ కొందరు గైనకాలజీ వైద్యుల ‘పనితీరు’కునిదర్శనంగానిలుస్తోంది. ఏప్రిల్ నెలలో మొత్తంగా 76 ప్రసవాలు జరిగాయి. మే నెలలో 63, జూన్‌లో 88 ప్రసవాలు జరిగాయి. ఇక్కడ ప్రసవాలు చేయడం కష్టమంటూ ఏప్రిల్‌లో ఏడు, మేనెలలో ఎనిమిది, జూన్‌నెలలో 12 రిఫర్ చేసినట్టుజిల్లా కేంద్ర ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించుకు న్న గర్భిణులే స్థానిక ప్రైవేటు క్లినిక్‌లలో ప్రసవాలు చేయించుకుంటున్నారంటే.. ఆసుప త్రిలో పనిచేస్తున్న గైనకాలజీ వైద్యుల పరిస్థితి అర్థమవుతుంది. జిల్లా కేంద్ర ఆసుపత్రి లో ప్రసవాలసంఖ్య పెరిగేలా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరంఎంతైనా ఉంది. ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్న గైనకాలజీ వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు నడపడం వలనే ప్రసవాల సంఖ్య తగ్గుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.సూర్యారావు వద్ద ప్రస్తావించగా... ప్రభుత్వ గైనకాలజీ వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లు నడపడం వల్ల ప్రసవాల సంఖ్య తగ్గి ఉండవచ్చునని భావిస్తున్నానని అన్నారు. ఇప్పటికే రిఫరల్ కేసులు సంఖ్య తగ్గించామని... ప్రసూతి విభాగంలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
Updated Date - Jun 30 , 2025 | 11:49 PM