ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజల దాహం కేకలు వినిపించవా?

ABN, Publish Date - Apr 30 , 2025 | 11:48 PM

‘మున్సిపాల్టీ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే అరకొ రగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రజల దాహం కేకలు వినిపించటం లేదా?’ అని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉలాల భారతి దివ్యతోపాటు కౌన్సిల్‌ సభ్యులు అధికారులను నిలదీశారు.

తాగునీటిపై అధికారులను నిలదీస్తున్న సభ్యులు

- తాగునీటి సమస్యపై అధికారులను నిలదీసిన కౌన్సిల్‌ సభ్యులు

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ‘మున్సిపాల్టీ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే అరకొ రగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రజల దాహం కేకలు వినిపించటం లేదా?’ అని మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉలాల భారతి దివ్యతోపాటు కౌన్సిల్‌ సభ్యులు అధికారులను నిలదీశారు. బుధవారం మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో చైర్‌పర్సన్‌ పిలక రాజలక్ష్మి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. అజెండా ల్లో ఉన్న 12అంశాలపై చర్చ జరగ్గా కొన్ని అంశాలపై కౌన్సిల్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సి పల్‌ కార్యాలయంలో మూడు ఏసీలు ఏర్పాటుకు రూ2.30లక్షలు సాధారణ నిధులు కేటాయించి కౌన్సిల్‌ ఆమోదం కోరగా, ఏసీల కొనుగోలుకు అంత డబ్బు ఎందుకు? ఎక్కడ ఏర్పాటు చేస్తారని వైస్‌ చైర్‌పర్సన్‌ భారతి దివ్య అధికారులను ప్రశ్నించారు. కులాయిల ద్వారా నీరు సరఫరా కావడం లేదని, మూడునెలల కులాయి పన్ను రద్దు చేయాలని, పూర్తిస్థాయిలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని 8వ వార్డు కౌన్సిలర్‌ పల్లంటి మధుమూర్తి కోరారు. ట్యాంకర్లను పెంచి 23 వార్డులకు పూర్తిస్థాయిలో తాగునీరు అంది వ్వాలని కౌన్సిలర్లు సుగ్గు ప్రేమ్‌, జి.శేఖర్‌, ఆశి లీలారాణి, ప్రదీప్‌, మధుమూర్తి, భారతిదివ్య, కాళ్ల వెంకటలక్ష్మితోపాటు మిగతా కౌన్సిల్‌ సభ్యులు కోరారు. దీనిపై చైర్‌పర్సన్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆరు ట్యాం కర్లు ఉన్నాయని, ఒక్కోదానితో ఏడు ట్రిప్పులు చొప్పున రోజుకి 48 ట్యాంకర్ల నీటిని ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు. అంతా సహకరించాలని చైర్‌పర్సన్‌ రాజలక్ష్మి, కమిషనర్‌ ఎన్‌.రమేష్‌ కోరారు.

Updated Date - Apr 30 , 2025 | 11:48 PM