ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నమ్మండి.. ఇది శ్వేతపుష్కరిణే!

ABN, Publish Date - May 17 , 2025 | 12:23 AM

శ్రీమహావిష్ణువు దశావతారా ల్లో రెండోది కూర్మనాథు డు వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం దేవస్థానం. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.

చెత్తా, చెదారంతో కలుషితమైన శ్వేతపుష్కరిణి నీళ్లు
  • నీళ్లు, పరిసరాలు కలుషితమే..

  • స్థానికుల స్నానాలూ ఇక్కడే..

  • అపరిశుభ్రంగా ప్రసిద్ధ కూర్మక్షేత్రం

గార, మే 16(ఆంధ్రజ్యోతి): శ్రీమహావిష్ణువు దశావతారా ల్లో రెండోది కూర్మనాథు డు వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం దేవస్థానం. ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తొలుత ఆలయ శ్వేత పుష్కరిణిలో పవిత్ర స్నా నాలు ఆచరించి, పెద్దలకు పితృ తర్పణాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దరి ్శంచుకుంటారు. కానీ ఇక్కడ పవిత్ర అష్టతీర్థాల్లో అత్యం త ప్రధానమైన తీర్థంగా పేరుగాంచిన శ్వేతపుష్కరిణి అధ్వానంగా తయారైంది. వాస్తవానికి ప్రతి రోజై ఉద యాన్నే ఈ పుష్కరిణి నుంచి నీటిని కలశంతో తీసు కువెళ్లి అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చన చేస్తుంటారు. కానీ శ్వేతపుష్కరిణి పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి, అపరిశుభ్రంగా తయార య్యాయి. పవిత్రమైన పుష్కరిణి జలాలు కలుషితమవుతుండడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పుష్కరిణికి రెండు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆలయానికి ఎదురుగా తూర్పు ముఖంగా, మరొక మార్గం ఆలయం వెలుపల ఉంది. ఇక్కడే పితృదేవతలకు పిండ తర్పణం వంటి కార్యక్రమాలను నిత్య మూ చేపడుతుం టారు. పితృకా ర్యాలు అనంత రం వదిలేసిన ఆహార పదా ర్థాలు, విస్త రాకులు, ఇతర చెత్తాచెదారంతో పరిసరాలు నిండి పోయి, దుర్వాసన రావ డమే కాకుండా, భక్తులు ఇక్కడ స్నానాలు చేయడానికి ఏమాత్రం అనువుగా లేకుండా పోయింది. ఇక్కడి నీరు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయి, జలాల్లో చెత్త తేలుతూ, దుర్వాసన వెదజల్లుతోంది. పుష్కరణి వద్ద ఇక్కడ వేసిన గ్రిల్స్‌ కూడా పాడైపోయాయి. చెత్తను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ విషయంలో సంబంధిత అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడంపై స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పుష్కరిణి పరిసరాలు శుభ్రం చేసి, భక్తుల పవిత్ర స్నానాలకు అనువుగా తయారు చేయాలని, ఆలయ ప్రతిష్టను కాపాడాలని భక్తులు కోరుతున్నారు.

శుభ్రం చేయిస్తాం

శ్వేతపుష్కరిణి నీటిని శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకంటాం. పరిసరాల్లోని చెత్తను తొలగించి, భక్తులను ఆహ్లాదకరంగా ఉండేలా చూస్తాం.

- కె.నరసింహనాయుడు, ఆలయ ఈవో

Updated Date - May 17 , 2025 | 12:23 AM